గ్రంధ చౌర్యంపై స్పందించిన కొరటాల
రిలీజ్ అయిపోయి, రికార్డులు కూడా సృష్టించిన తర్వాత శ్రీమంతుడు సినిమాపై కోర్టు కేసు పడడం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. శరత్ చంద్ర అనే రచయిత… ఈ సినిమాపై కేసు వేశాడు. కోర్టు కూడా అందరికీ నోటీసులు జారీచేసింది. ఎట్టకేలకు ఈ కోర్టు కేసుకు సంబంధించి కొరటాల శివ స్పందించాడు. తను ఒక రచయితనని, మిగతా రచయితల పట్ల తనకు చాలా గౌరవం ఉందని తెలిపిన కొరటాల శివ….. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కాబట్టి దానిపై […]
Advertisement
రిలీజ్ అయిపోయి, రికార్డులు కూడా సృష్టించిన తర్వాత శ్రీమంతుడు సినిమాపై కోర్టు కేసు పడడం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. శరత్ చంద్ర అనే రచయిత… ఈ సినిమాపై కేసు వేశాడు. కోర్టు కూడా అందరికీ నోటీసులు జారీచేసింది. ఎట్టకేలకు ఈ కోర్టు కేసుకు సంబంధించి కొరటాల శివ స్పందించాడు. తను ఒక రచయితనని, మిగతా రచయితల పట్ల తనకు చాలా గౌరవం ఉందని తెలిపిన కొరటాల శివ….. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కాబట్టి దానిపై ఇప్పుడే స్పందించనని స్పష్టంచేశాడు. ఏ విషయమైనా కోర్టులో తేల్చుకుంటామని అన్నాడు.
తన సినిమా ఇప్పటికే విడులైందని, అటు శరత్ చంద్ర రాసి చచ్చేంత ప్రేమ అనే నవల కూడా మార్కెట్లోనే ఉంది కాబట్టి… నిజమేంటనేది ప్రజలే తెలుసుకుంటారని అన్నాడు. మరోవైపు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ కూడా కోర్టు వ్యవహారంలో తలదూర్చడానికి నిరాకరించాడు. అయితే విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే… చచ్చేంత ప్రేమ అనే నవలలో కేవలం గ్రామాల దత్తత అనే అంశం మాత్రమే ఉందని… కానీ శ్రీమంతుడులో ఆ అంశాన్ని మరింత విస్తృతంగా చూపించారని అంటున్నారు.
Advertisement