జగన్‌ విషయంలో ఆ ఒక్కదానికి బాధగా ఉంది...

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన భూమా అఖిల ప్రియ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. తప్పని సరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వచ్చిందిన్నారు.  ప్రజల కోసమే పార్టీ మారామన్నారు. ఎన్నికైన ఏడాదిన్నరలోనే పార్టీ మారడం తప్పు అనిపించలేదా అని ప్రశ్నించగా అఖిల ప్రియ సమాధానం చెప్పారు. పార్టీ మారినందుకు గిల్టీగా ఫీల్ అవడం లేదని కాకపోతే ఒక విషయంలో మాత్రం చాలా బాధగా ఉందన్నారు.  వైసీపీలో ఉన్నప్పుడు రోజూ జగన్‌ […]

Advertisement
Update:2016-02-29 02:00 IST

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన భూమా అఖిల ప్రియ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. తప్పని సరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వచ్చిందిన్నారు. ప్రజల కోసమే పార్టీ మారామన్నారు. ఎన్నికైన ఏడాదిన్నరలోనే పార్టీ మారడం తప్పు అనిపించలేదా అని ప్రశ్నించగా అఖిల ప్రియ సమాధానం చెప్పారు.

పార్టీ మారినందుకు గిల్టీగా ఫీల్ అవడం లేదని కాకపోతే ఒక విషయంలో మాత్రం చాలా బాధగా ఉందన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు రోజూ జగన్‌ గారితో మాట్లాడేదానినని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నానని చెప్పారామె. జగన్ రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించారని తాను అనుకోవడం లేదన్నారు.

వ్యక్తిగతంగా జగన్‌ కుటుంబంతో చాలా అనుబంధం ఉందన్నారు. తనకు, తన నాన్నకు, తన కుటుంబానికి జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారని అఖిల ప్రియ చెప్పారు. జగన్ సీఎం కావాలని అమ్మ తపించిన మాట వాస్తవమేనన్నారు. జగన్ సీఎం అయితే వ్యక్తిగతంగా తాము కూడా ఆనందిస్తామన్నారు. జగన్‌పై తమకు ఒక్కశాతం కూడా కోపం లేదన్నారు.

నాన్న మీద నమ్మకంతోనే జగన్ పీఏసీ పదవి ఇచ్చారని… ఆ పదవిలో ఉన్నసమయంలో తన నాన్న ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేశారని చెప్పారు. జగన్‌కు, ఆయన కుటుంబానికి మంచి జరగాలనే కోరుకుంటున్నామన్నారు. ఆ విషయంలో జగన్‌కు తాను ఆల్‌‌ ది బెస్ట్ చెబుతున్నానన్నారు. రెండు పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదే అన్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News