బెస్ట్ యాక్ట‌రెస్ గా జెన్నిఫర్ లారెన్స్ కు `ఆస్కార్`?

సినిమా అవార్డుల కు సంబంధించినంత వ‌ర‌కు ఆస్కార్ అవార్డు అత్యుత్త‌మ‌మైన‌ది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఆస్కార్ బెస్ట్ యాక్ట‌రెస్ పుర‌స్కారం రేసు లో జెన్నిఫ‌ర్ లారెన్స్ ముందు ఉంది. ప్ర‌స్తుతం బ్రీ లార్స‌న్, బార్లొట్ ర్యాంప్లింగ్, సవోర్స‌కే రోస‌న్ ల‌తో పాటు.. జెన్నిఫ‌ర్ లారెన్స్ లు ఈ యేడాది ఆస్కార్ బెస్ట్ యాక్ట‌రెస్ ల రేసు లో వున్నారు. అయితే వీరంద‌రిలో జెన్నిఫ‌ర్ న‌టించిన జాయ్ సినిమాకే బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డ్ వ‌చ్చే […]

Advertisement
Update:2016-02-27 10:52 IST

సినిమా అవార్డుల కు సంబంధించినంత వ‌ర‌కు ఆస్కార్ అవార్డు అత్యుత్త‌మ‌మైన‌ది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఆస్కార్ బెస్ట్ యాక్ట‌రెస్ పుర‌స్కారం రేసు లో జెన్నిఫ‌ర్ లారెన్స్ ముందు ఉంది. ప్ర‌స్తుతం బ్రీ లార్స‌న్, బార్లొట్ ర్యాంప్లింగ్, సవోర్స‌కే రోస‌న్ ల‌తో పాటు.. జెన్నిఫ‌ర్ లారెన్స్ లు ఈ యేడాది ఆస్కార్ బెస్ట్ యాక్ట‌రెస్ ల రేసు లో వున్నారు. అయితే వీరంద‌రిలో జెన్నిఫ‌ర్ న‌టించిన జాయ్ సినిమాకే బెస్ట్ యాక్ట‌రెస్ అవార్డ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నేది ప‌రిశీల‌కుల టాక్.

ఆస్కార్ అవార్డు చ‌రిత్రలో బ్లాంచెట్ త‌ర్వాత అత్య‌ధిక నామినేష‌న్లు పొందింని చిత్రం జెన్నిఫ‌ర్ పోటిపడుతున్న 'జాయ్' చిత్ర‌మే. ఉత్త‌మ న‌టిగా ఓ సారి పుర‌స్కారం కైవ‌సం చేసుకున్న జెన్ని.. ఇప్పుడు జాయ్ చిత్రంతో అంద‌రికంటే ముందు వ‌ర‌స‌లోఉంది. భ‌ర్త‌తో విడిపోయి ..ముగ్గురు పిల్ల‌ల త‌ల్లి జాయ్ మంగానో స్వ‌శ‌క్తితో క‌ష్టాల‌ను ఎలా అథిక‌మించింద‌న్న‌ది ఇందులో చూపించారు. ఎన్నో గృహోప‌క‌ర‌ణాల‌ను క‌నిపెట్టి ధ‌న‌వంతురాలైన వ్యాపార వేత్త‌గా ఎదిగింది జాయ్. ఈ పాత్ర‌లో జెన్నిఫ‌ర్ అద్భుత‌మైన న‌టన క‌న‌బ‌రిచింది. ప‌రిశీల‌కుల అంచ‌న అయితే ఈ సారి జెన్నిఫ‌ర్ కే బెస్ట్ యాక్ట‌రెస్ ఆస్కారం ఉందంటున్నారు మ‌రి.

Tags:    
Advertisement

Similar News