ఆడియో, వీడియో టేపులున్నాయి- అంబటి సంచలన ప్రకటన

వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు జరిపిన బేరసారాలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండకు ఎండి వానకు తడిసి, చలికి వణికి నిలబడిన పార్టీ వైసీపీ అని అంబటి అన్నారు. అలాంటి పార్టీని దెబ్బతీయయడం…   చంద్రబాబును పుట్టించిన వాడి వల్ల కూడా కాదన్నారు. చంద్రబాబు పుట్టించిన లోకష్ వల్ల అంత కన్నా కాదన్నారు.  ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నంలో టీడీపీ నేతలు దొరికిపోయారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు ఎవరు ఏంమాట్లాడారు… ఎంత […]

Advertisement
Update:2016-02-27 07:05 IST

వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు జరిపిన బేరసారాలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండకు ఎండి వానకు తడిసి, చలికి వణికి నిలబడిన పార్టీ వైసీపీ అని అంబటి అన్నారు. అలాంటి పార్టీని దెబ్బతీయయడం… చంద్రబాబును పుట్టించిన వాడి వల్ల కూడా కాదన్నారు. చంద్రబాబు పుట్టించిన లోకష్ వల్ల అంత కన్నా కాదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నంలో టీడీపీ నేతలు దొరికిపోయారని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు ఎవరు ఏంమాట్లాడారు… ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అన్న దానికి సంబంధించి త్వరలోనే సాక్ష్యాలు బయటపెడుతామన్నారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు ఎంతెంత డబ్బు తీసుకున్నారన్న దానిపైనా ఆధారాలున్నాయన్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయన్నారు. తొందరపడాల్సిన పనిలేదన్నారు. టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారా అని ప్రశ్నించగా అంత అవసరం లేదని అంబటి రాంబాబు అన్నారు. ఆడియో టేపులు, వీడియో టేపులు అన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అంత వరకు ఎదురుచూడండి అని అన్నారు.

ఫోన్ సంభాషణలను రికార్డు చేయడానికి ట్యాపింగే అవసరం లేదని ఫోన్‌లో ఎవరైనా రికార్డు చేసుకోవచ్చని చెప్పారు. కొందరు నిజాయితీపరులు ఆ పనిచేశారన్నారు. ఏ దొంగ అయినా ఆధారాలు వదిలి వెళ్లడం ఖాయమని, టీడీపీ నేతల విషయంలోనూ అదే జరిగిందన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న గెస్ట్ హౌజ్ లో చేరిన వారంతా అదే కృష్ణానదిలో మునిగిపోవడం ఖాయమన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే సైకిల్ గుర్తు మీద గెలిచిన వారు గాడిదలు కాయాలా అని అంబటి ప్రశ్నించారు. అయితే అంబటి రాంబాబు మాట వరసకు అన్నారా లేక నిజంగానే ఆడియో, వీడియో టేపులున్నాయో తేలాలి. ఒకవేళ అదే నిజమైతే అది పెద్ద సంచలనమే అవుతుంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News