పిల్లలు కనేందుకు జనం రెడీ బాబు… మీరు ఆ రెండూ చేస్తే ….

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం మనది.  జనాభా ఎక్కువ అవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమే కుటుంబనియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తోంది.  ఇద్దరికి మించి పిల్లలను కనవద్దు అని చెబుతోంది. చెప్పడమే కాదు ఇద్దరికి మించి పిల్లలు ఉంటే గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు.  చట్టం ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా పిలుపునివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కాపు […]

Advertisement
Update:2016-02-26 04:33 IST

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం మనది. జనాభా ఎక్కువ అవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమే కుటుంబనియంత్రణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇద్దరికి మించి పిల్లలను కనవద్దు అని చెబుతోంది. చెప్పడమే కాదు ఇద్దరికి మించి పిల్లలు ఉంటే గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. చట్టం ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా పిలుపునివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కాపు రుణమేళాలో ప్రసంగించిన చంద్రబాబు ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది పిల్లలను కనండి… జనాభా పెంచండి అని కోరారు. ఏపీలో జనాభా శాతం తగ్గుతోందని… మరణాల సంఖ్యతో సమానంగా జననాలు ఉన్నాయన్నారు. వచ్చే కాలానికి యువత తగ్గిపోయే స్థితి ఉంది కాబట్టి ఇప్పుడే అప్రమత్తం కావాలని చెప్పారు. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాబు అలా పిలుపునివ్వడం సంగతి పక్కన పెడితే… ఈ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి.

ఇద్దరు మించి పిల్లలను కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. మరి ఆ నిబంధన తొలగిస్తారా? ఇద్దరు పిల్లలను చదవించాలంటే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు తల్లిదండ్రులు రక్తం ధారపోయాల్సి వస్తోంది. లక్షలకు లక్షలు గుంజేస్తున్నారు. మరి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారి విషయంలో ఆ ఫీజులను కనీసం లక్షల నుంచి వేలల్లోకి తెస్తారా?. ఇవన్నీ మీరు చేస్తే పిల్లలను కనడం ఏముంది సార్. డబ్బున్నోళ్లు మాత్రం ఇద్దరు పిల్లలను కనాలి. పేదోళ్లు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కని బాలకార్మికులుగా అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. భలే ఉంది…

Click on image to read:

Tags:    
Advertisement

Similar News