దానం నుంచి గుర్తు చేసుకో!- బాబుపై కొడాలి ఫైర్
పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణలో ఒకలా… ఏపీలో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశానికి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, కొడాలి నాని, పార్థసారథి, జోగి రమేష్, వంగవీటి రాధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని కొడాలి విమర్శించారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా […]
పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణలో ఒకలా… ఏపీలో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలతో వైసీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశానికి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, కొడాలి నాని, పార్థసారథి, జోగి రమేష్, వంగవీటి రాధా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని కొడాలి విమర్శించారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ చేసిందేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు తనను తాను తిట్టుకుంటున్నట్టుగా ఉందన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు మూలం వైఎస్సేనని టీడీపీ నేతలు చెప్పడాన్ని నాని తప్పుపట్టారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాక టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్లోకి వస్తే రాజశేఖర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయించారని గుర్తు చేశారు. మూడు నెలల్లోనే ఎన్నికలు జరిపించారని చెప్పారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు తన వెంట వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. శోభానాగిరెడ్డితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్ముధైర్యం ఉంటే శోభమ్మ తరహాలోనే నాగిరెడ్డి చేత కూడా రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు రాజకీయ పుట్టుకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో మొదలైందని విమర్శించారు. అవసరం కోసం సోనియా, పవన్ కల్యాణ్, మోదీల కాళ్లు పట్టుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. టీడీపీని జాతీయ పార్టీ చేస్తానన్న చంద్రబాబు చివరకు దాన్ని ఉప ప్రాంతీయ పార్టీని చేశారని నాని ఎద్దేవా చేశారు. మరో ఏడాది గడిస్తే జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం, నంద్యాల శిల్పా కుటుంబం చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాయని కొడాలి నాని అన్నారు.
Click on image to read: