ఏపీ చీఫ్‌ సెక్రటరీగా విజయానంద్‌!

ఫైనల్‌ చేసిన సీఎం చంద్రబాబు.. త్వరలోనే అధికారిక ప్రకటన?

Advertisement
Update:2024-12-28 18:21 IST

ఆంధ్రప్రదేశ్‌ కొత్త చీఫ్‌ సెక్రటరీగా ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌, 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ ను నియమించినట్టు తెలుస్తోంది. ఆయన పేరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైనల్‌ చేశారని ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనుంది. 1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ జి. సాయిప్రసాద్‌ కు సీఎస్‌ గా చాన్స్‌ ఇవ్వాలని పలువురు నాయకులు చంద్రబాబును కోరినా.. విజయానంద్‌ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సాయిప్రసాద్‌ సొంత సామాజిక వర్గం కమ్మ కావడంతో ఆయనకు విజయానంద్‌ తర్వాత ఏడాది పాటు సీఎస్‌ గా అవకాశం ఇస్తానని చంద్రబాబు నాయకులకు నచ్చజెప్పినట్టుగా సమాచారం. ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లలో 1990వ బ్యాచ్‌ కు చెందిన అనంతరాము సీనియర్‌.. ఆయనకు రాజకీయంగా పలుకుబడి లేకపోవడంతో సీఎస్‌గా ఆయన పేరు పరిశీలనలో లేదని తెలుస్తోంది. 1991వ బ్యాచ్‌ కు చెందిన సుమితా డావ్రా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆమె మూడు నెలల్లోనే రిటైర్‌ కానుండటంతో ఆమె పేరును పరిశీలనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. 1991 బ్యాచ్‌ కే చెందిన ఆర్పీ సిసోడియాకు మూడేళ్ల సర్వీస్‌ ఉన్నా.. పలు కారణాలతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. విజయానంద్‌ నియామకంపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News