త‌మ్ముడు తిట్టాడ‌ని ఆత్మ‌హ‌త్య‌!

కాలేజికి ఎందుకువెళ్ల‌లేదంటూ త‌మ్ముడు తిట్టాడ‌ని ఒక డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. బోయిన్‌ప‌ల్లిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బోయిన‌ప‌ల్లికి చెందిన 19ఏళ్ల మాన‌స సికింద‌రాబాద్‌లోని దివాన్ బ‌హ‌దూర్ మ‌హిళ‌ల కాలేజిలో డిగ్రీ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతోంది. గురువారం సాయంత్రం నాలుగుగంట‌ల ప్రాంతంలో కాలేజి నుండి వ‌చ్చిన ఆమె త‌మ్ముడు మ‌ణికంఠ‌, అక్క ఇంట్లోనే ఉండ‌టం చూసి, కాలేజికి ఎందుకు వెళ్ల‌లేదంటూ మంద‌లించాడు. దాంతో కోపానికి, బాధ‌కు గుర‌యిన మాన‌స బాత్‌రూములోకి వెళ్లి త‌న దుప‌ట్టాతో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. మాన‌స ఇంత‌కుముందు కూడా ఇలాంటి చిన్న కార‌ణాల‌తోనే […]

Advertisement
Update:2016-02-20 09:37 IST

కాలేజికి ఎందుకువెళ్ల‌లేదంటూ త‌మ్ముడు తిట్టాడ‌ని ఒక డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. బోయిన్‌ప‌ల్లిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బోయిన‌ప‌ల్లికి చెందిన 19ఏళ్ల మాన‌స సికింద‌రాబాద్‌లోని దివాన్ బ‌హ‌దూర్ మ‌హిళ‌ల కాలేజిలో డిగ్రీ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతోంది. గురువారం సాయంత్రం నాలుగుగంట‌ల ప్రాంతంలో కాలేజి నుండి వ‌చ్చిన ఆమె త‌మ్ముడు మ‌ణికంఠ‌, అక్క ఇంట్లోనే ఉండ‌టం చూసి, కాలేజికి ఎందుకు వెళ్ల‌లేదంటూ మంద‌లించాడు. దాంతో కోపానికి, బాధ‌కు గుర‌యిన మాన‌స బాత్‌రూములోకి వెళ్లి త‌న దుప‌ట్టాతో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. మాన‌స ఇంత‌కుముందు కూడా ఇలాంటి చిన్న కార‌ణాల‌తోనే రెండుసార్లు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. మాన‌స తండ్రి ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా పేర్కొంటూ కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

Tags:    
Advertisement

Similar News