ఈయన ఉషాపతే!

కొంత కాలంగా వెంక‌య్య‌నాయుడు భ‌విష్య‌త్తుపై మీడియా ర‌క‌ర‌కాలుగా ర‌చ‌న‌లు చేస్తోంది. జూన్ 30తో వెంక‌య్య రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌డం, మూడు సార్ల‌కు మించి ఒక‌వ్య‌క్తి రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న బీజేపీ నిబంధ‌న కార‌ణంగా వెంక‌య్య భ‌విష్య‌త్తుపై గాసిప్ పుట్టుకొచ్చాయి. వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్తార‌ని కొంద‌రు, లేదు టీడీపీ కోటాలో రాజ్య‌స‌భ‌కు వెళ్తార‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే వాటికి వెంక‌య్యే స్వ‌యంగా తెర‌దింపారు. త‌న జీవితంపై తానే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. తాను ఎప్ప‌టికీ ఉషాప‌తినే (ఉషా వెంక‌య్య భార్య […]

Advertisement
Update:2016-02-18 05:23 IST

కొంత కాలంగా వెంక‌య్య‌నాయుడు భ‌విష్య‌త్తుపై మీడియా ర‌క‌ర‌కాలుగా ర‌చ‌న‌లు చేస్తోంది. జూన్ 30తో వెంక‌య్య రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌డం, మూడు సార్ల‌కు మించి ఒక‌వ్య‌క్తి రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న బీజేపీ నిబంధ‌న కార‌ణంగా వెంక‌య్య భ‌విష్య‌త్తుపై గాసిప్ పుట్టుకొచ్చాయి. వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్తార‌ని కొంద‌రు, లేదు టీడీపీ కోటాలో రాజ్య‌స‌భ‌కు వెళ్తార‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే వాటికి వెంక‌య్యే స్వ‌యంగా తెర‌దింపారు. త‌న జీవితంపై తానే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. తాను ఎప్ప‌టికీ ఉషాప‌తినే (ఉషా వెంక‌య్య భార్య పేరు) … ఉప రాష్ట్ర‌ప‌తిని కాబోను అని చమత్కరించారు. వెంక‌య్య సేవ‌ల అవ‌స‌రం దృష్ట్యా నాలుగోసారి రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని బీజేపీ అధిష్టానం నిర్ణ‌యించింద‌ని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి వెంకయ్యను రాజ్యసభకు పంపుతార‌ని తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్తే అప్పుడు వెంక‌య్య‌ను టీడీపీ నేత‌గా చూస్తారే గానీ బీజేపీ నేత‌గా చూసే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News