కేజ్రీవాల్...కుమారుల ఉప‌మానం!

ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేపట్టి సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న అర‌వింద్ కేజ్రీవాల్ తాను ప్ర‌జ‌ల‌కు చేసిన వాగ్దానాల‌న్నీ నేర‌వేర్చుకుంటూ వ‌స్తున్నాన‌న్నారు. తాను ప‌నిచేయాల‌నుకున్నా, కేంద్రం త‌న‌ని చేయ‌నివ్వ‌డం లేదంటూ చాలా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు  చేశారు. దేశానికి కేంద్ర ప్ర‌భుత్వం, ఢిల్లీ ప్ర‌భుత్వం…ఇద్ద‌రు కొడుకులని అన్నారు. అయితే చిన్న కొడుకైన ఢిల్లీ ప‌నిచేయాల‌ని అనుకుంటుండ‌గా, పెద్ద‌కొడుకైన కేంద్రం చేయ‌నివ్వ‌టం లేద‌ని ఆయ‌న అన్నారు. మోడీకి త‌న పేరు వింటేనే కోపం వ‌చ్చేస్తుంద‌ని, ఉద్రేకంతో ఊగిపోతున్నార‌ని, ఆయ‌న త‌న‌ని నేరుగా ఎదుర్కోలేక […]

Advertisement
Update:2016-02-16 02:30 IST

ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేపట్టి సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న అర‌వింద్ కేజ్రీవాల్ తాను ప్ర‌జ‌ల‌కు చేసిన వాగ్దానాల‌న్నీ నేర‌వేర్చుకుంటూ వ‌స్తున్నాన‌న్నారు. తాను ప‌నిచేయాల‌నుకున్నా, కేంద్రం త‌న‌ని చేయ‌నివ్వ‌డం లేదంటూ చాలా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. దేశానికి కేంద్ర ప్ర‌భుత్వం, ఢిల్లీ ప్ర‌భుత్వం…ఇద్ద‌రు కొడుకులని అన్నారు. అయితే చిన్న కొడుకైన ఢిల్లీ ప‌నిచేయాల‌ని అనుకుంటుండ‌గా, పెద్ద‌కొడుకైన కేంద్రం చేయ‌నివ్వ‌టం లేద‌ని ఆయ‌న అన్నారు. మోడీకి త‌న పేరు వింటేనే కోపం వ‌చ్చేస్తుంద‌ని, ఉద్రేకంతో ఊగిపోతున్నార‌ని, ఆయ‌న త‌న‌ని నేరుగా ఎదుర్కోలేక పిరికివాడిలా సిబిఐని అడ్డుపెట్టుకుని త‌న ఆఫీసుపై దాడులు చేయించార‌ని మండిప‌డ్డారు. త‌మ ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై లేనిపోని అరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు. న‌కిలీ న్యాయ‌వాద ప‌ట్టా కేసులో త‌మ మంత్రి తోమ‌ర్‌ని అరెస్టు చేశార‌ని, మ‌రి స్మృతీ ఇరానీని ఇదే విష‌యంమీద అరెస్టు చేయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. అస‌లు మోడీ ఏం చ‌దివారు, ఆయ‌నకున్న డిగ్రీలేంట‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికీ ఢిల్లీలో వాట‌ర్‌టాంక‌ర్ల‌తో నీటిని తెచ్చుకోవ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఆ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతామ‌ని అన్నారు. త‌మ‌పై జ‌రుగుతున్న అన‌వ‌స‌ర‌మైన దాడులు, ఆరోప‌ణ‌లు, ఆటంకాలు అన్నింటివెనుక ప్ర‌ధాని కార్యాల‌యం ఉంద‌ని బిజెపి నాయ‌కులే త‌మ‌కు చెబుతున్నార‌ని కేజ్రీవాల్ అన్నారు. మొత్తానికి కేజ్రీవాల్ త‌న‌ సంవ‌త్స‌ర కాల‌ పాల‌నా స‌మీక్ష‌లో మోడీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News