నేను సన్న దొరను!. ఐరన్‌ హ్యాండ్‌తో డీల్ చేస్తా.. జాగ్రత్త!

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి… ప్రాజెక్ట్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సభలో కేసీఆర్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో దొడ్డుదొరలు రాష్ట్రాన్ని పాలించారని.. దొడ్డుదొరల కాలంలో హాస్టల్ విద్యార్థులకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారన్నారు. తాను చిన్న దొరనని… సన్న ముఖ్యమంత్రినని అందుకే విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే కాలంలో అన్ని కాలేజ్‌లు, […]

Advertisement
Update:2016-02-16 09:33 IST

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి… ప్రాజెక్ట్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సభలో కేసీఆర్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

గతంలో దొడ్డుదొరలు రాష్ట్రాన్ని పాలించారని.. దొడ్డుదొరల కాలంలో హాస్టల్ విద్యార్థులకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారన్నారు. తాను చిన్న దొరనని… సన్న ముఖ్యమంత్రినని అందుకే విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే కాలంలో అన్ని కాలేజ్‌లు, యూనివర్శిటీలకు సన్నబియ్యం అందజేస్తామన్నారు.

సభకు అటంకం కలిగించేందుకు కొందరు పీడీఎస్‌యూ విద్యార్థులు ప్రయత్నించడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. మంచి కార్యక్రమానికి తాను వస్తే అడ్డుకుంటారా?… పీడీఎస్‌యూ సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. తాను బస్సులో వస్తుంటే నలుగురు జెండాలు పట్టుకుని అడ్డంగా పడుకోవడం, దాన్ని పత్రికల్లో రాయించుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఇకపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఎవరి సహనానికైనా హద్దు ఉంటుందన్నారు. ”వెకిలివేషాలు వేస్తే ఇకపై ఐరన్ హ్యాండ్‌తో డీల్ చేస్తా.. జాగ్రత్తా!” అని కేసీఆర్ హెచ్చరించారు. సమాజంలో మంచిపనులు జరుగుతుంటే అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరినప్పుడు తనను చాలా మంది చాలా మాటలన్నారని గుర్తు చేశారు. బక్కోడి మెడ ఇరిచేద్దామన్నారని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News