అరుణమ్మపైనే రూమర్సా! అంతలేదట!
తెలంగాణ కాంగ్రెస్‌లో భవిష్యత్తుకు కాస్తయిన గ్యారెంటీ ఉన్న నేతలెవరని అడిగితే!… టాప్ 5లో డీకే అరుణ పేరు తప్పని సరిగా ఉంటుంది. లోకల్‌పై ఆమెకున్న పట్టు అలాంటిది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టేట్ మొత్తం కాంగ్రెస్ కుప్పకూలితే (నల్లగొండ మినహా) మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం ఒక స్థానాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ విజయం కాదు. డీకే అరుణ విజయమే. అంతే కాదు టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నుంచి ధాటిగా ఎదుర్కొంటున్న లీడర్లలో […]
తెలంగాణ కాంగ్రెస్‌లో భవిష్యత్తుకు కాస్తయిన గ్యారెంటీ ఉన్న నేతలెవరని అడిగితే!… టాప్ 5లో డీకే అరుణ పేరు తప్పని సరిగా ఉంటుంది. లోకల్‌పై ఆమెకున్న పట్టు అలాంటిది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టేట్ మొత్తం కాంగ్రెస్ కుప్పకూలితే (నల్లగొండ మినహా) మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం ఒక స్థానాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ విజయం కాదు. డీకే అరుణ విజయమే. అంతే కాదు టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నుంచి ధాటిగా ఎదుర్కొంటున్న లీడర్లలో డీకే అరుణ కూడా ఒకరు. అలాంటి అరుణపై ఇప్పుడు ఒక వార్త బాగా హల్‌చల్ చేస్తోంది.
డీకే అరుణ కారెక్కేందుకు సిద్ధమయ్యారన్నది ఆ వార్త సారాంశం. డీకే అరుణ టీఆర్ ఎస్‌లో చేరుతారన్న వార్త కాంగ్రెస్ శ్రేణులను ఒకింత షాక్‌కు గురిచేసింది. డీకే కుటుంబం చేస్తున్న మైనింగ్ వ్యాపారం వివాదాస్పదమై కోట్లాది రూపాయల జరిమానా చెల్లించాల్సి రావడం, జూబ్లిహిల్స్‌లో ఇటీవల డీకే అరుణ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలు జరిగాయి. సదరు స్థలంలో రాత్రికి రాత్రి రోడ్డు కూడా వేసేశారు. ఇలాంటి ఒత్తిళ్ల నేపథ్యంలో డీకే అరుణ టీఆర్ఎస్‌లో చేరుతున్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిని డీకే అరుణ ఖండించారు. తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు. పనిలోపనిగా నారాయణఖేడ్‌లో అధికార దుర్వినియోగం చేయడం ద్వారా టీఆర్ఎస్ విజయం సాధించిందని ఆరోపించారు. గద్వాల జిల్లా సాధన కోసం ప్రాణమైనా ఇస్తానని చెప్పారు.
మొత్తం మీద డీకే అరుణ ఖండన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అయితే జంపింగ్ వార్తలను ఖండించినంత మాత్రాన అదే నిజమని నమ్మే రోజులు కావివి. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Click on Image to Read: