కేసీఆర్‌ భవిష్యత్తుపై ఓ అంచనాకు వచ్చిన మోదీ!

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ట్రెండ్‌ నడుస్తోంది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన ప్రతిపక్షాలు ఇప్పట్లో తాము కోలుకోవడం కష్టమేనని నిరూపించుకున్నాయి. టీడీపీపై మాత్రం వరంగల్ ఉప ఎన్నిక పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. కానీ అంతవరకు గ్రేటర్‌ పరిధిలోని సెటిలర్ల ఓటు బ్యాంకును చూపిస్తూ తొడకొట్టిన టీడీపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కళ్లు తేలేసింది. దీంతో టీడీపీ స్టామినా కూడా తేలిపోయింది. అదే సమయంలో కేసీఆర్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మోదీతో కేసీఆర్‌, కేంద్ర కేబినెట్‌లోకి టీఆర్‌ఎస్ […]

Advertisement
Update:2016-02-15 03:57 IST

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ట్రెండ్‌ నడుస్తోంది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన ప్రతిపక్షాలు ఇప్పట్లో తాము కోలుకోవడం కష్టమేనని నిరూపించుకున్నాయి. టీడీపీపై మాత్రం వరంగల్ ఉప ఎన్నిక పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. కానీ అంతవరకు గ్రేటర్‌ పరిధిలోని సెటిలర్ల ఓటు బ్యాంకును చూపిస్తూ తొడకొట్టిన టీడీపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కళ్లు తేలేసింది. దీంతో టీడీపీ స్టామినా కూడా తేలిపోయింది. అదే సమయంలో కేసీఆర్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మోదీతో కేసీఆర్‌, కేంద్ర కేబినెట్‌లోకి టీఆర్‌ఎస్ చేరడం వంటి అంశాలపై చర్చ మొదలైంది.

టీఆర్‌ఎస్ ఎన్డీఏలోకి చేరడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కేసీఆర్‌ కన్నా మోదీయే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. చంద్రబాబు, కేసీఆర్‌లలో ఎవరి బలమెంతో మోదీకి అర్థమవడమే ఇందుకు కారణమంటున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న గ్రేటర్‌ ఎన్నికల్లోనూ టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో సమీప భవిష్యత్తులో టీడీపీ పుంజుకోవడం సాధ్యం కాదన్న భావనకు మోదీ బృందం వచ్చిందని చెబుతున్నారు. గ్రేటర్‌లో సెటిలర్ల పల్స్‌ చూసిన తర్వాత ఏపీలోనూ టీడీపీపై ప్రజల్లో సానుకూల వైఖరి లేదన్న అభిప్రాయానికి వచ్చేశారు.

అదే సమయంలో వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటింగ్‌ శాతం, పాజిటివ్ ఓటింగ్‌ను చూసిన తర్వాత 2019లోనూ గులాబీ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న ఒక అంచనాకు బీజేపీ పెద్దలు వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2019లో హంగ్‌ తరహా పరిస్థితి ఏర్పడితే తిరిగి కేంద్రంలో పగ్గాలు చేపట్టాలంటే టీఆర్ఎస్‌ లాంటి పార్టీలను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకోవాలన్న యోచనకు మోదీ వచ్చారట. అదే సమయంలో చంద్రబాబు తీరు సౌండ్ ఎక్కువ, వర్క్ తక్కువ అన్నట్టుగా ఉందన్న భావన బీజేపీలో ఇటీవల బలపడుతోందని నేతలు చెబుతున్నారు. అందుకే మోదీ ఇప్పటి నుంచే అప్రమత్తమై కేసీఆర్‌ను దగ్గర చేసుకుంటున్నారని అంటున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గ్రాండ్ విక్టరీపై కేసీఆర్‌ను మోదీ ప్రత్యేకంగా అభినందించడం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బీజేపీ నాశనమైనా పర్వాలేదు… తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో దోస్తి వీడకూడదని భావించే కొందరు బీజేపీ పెద్దల ఎత్తులు కూడా ఈసారి పారలేదని తెలుస్తోంది. ఇంతకాలం సదరు నేతల మాటలు విన్న బీజేపీ పెద్దలు… ఇప్పుడు మాత్రం అంత సినిమా ఉంటే డిపాజిట్లు కూడా ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తున్నారట. మొత్తం మీద టీఆర్‌ఎస్‌,బీజేపీకి దగ్గరైతే టీడీపీకి కొద్దిమేర ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News