అక్ర‌మ నిర్మాణం చేసినందుకు షారుక్‌ ఖాన్‌కి జ‌రిమానా

బ్రిహాన్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కి షారుక్‌ఖాన్ 1,93,784 రూ. జ‌రిమానా చెల్లించాడు. బాంద్రాలోని త‌న బంగ్లా మ‌న్న‌త్ ముందు ఆయ‌న అక్ర‌మ నిర్మాణం జ‌ర‌ప‌డంతో ఈ జ‌రిమానా చెల్లించాల్సివ‌చ్చింది. త‌న వ్యానిటీ వ్యాన్ పార్కింగ్ కోసం త‌న బంగ్లా గేటు అవ‌త‌ల షారుక్ ఈ నిర్మాణం చేశాడు. సామాజిక కార్య‌క‌ర్త‌లు అనిల్ గ‌న్‌గాలి మ‌రికొంత‌మంది సిటిజ‌న్లు సామాజిక కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి చేసిన పిటీష‌న్ల మేర‌కు ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్పందించింది. బిఎమ్‌సి ఈ అక్ర‌మ‌నిర్మాణాన్ని ఈ నెల […]

Advertisement
Update:2016-02-13 02:39 IST

బ్రిహాన్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కి షారుక్‌ఖాన్ 1,93,784 రూ. జ‌రిమానా చెల్లించాడు. బాంద్రాలోని త‌న బంగ్లా మ‌న్న‌త్ ముందు ఆయ‌న అక్ర‌మ నిర్మాణం జ‌ర‌ప‌డంతో ఈ జ‌రిమానా చెల్లించాల్సివ‌చ్చింది. త‌న వ్యానిటీ వ్యాన్ పార్కింగ్ కోసం త‌న బంగ్లా గేటు అవ‌త‌ల షారుక్ ఈ నిర్మాణం చేశాడు. సామాజిక కార్య‌క‌ర్త‌లు అనిల్ గ‌న్‌గాలి మ‌రికొంత‌మంది సిటిజ‌న్లు సామాజిక కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి చేసిన పిటీష‌న్ల మేర‌కు ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్పందించింది. బిఎమ్‌సి ఈ అక్ర‌మ‌నిర్మాణాన్ని ఈ నెల 15న కూల‌గొట్ట‌నుంది. దాంతో పాటు ఫైన్‌కూడా విధించ‌గా షారుక్ ఆ మొత్తాన్ని చెక్కుద్వారా చెల్లించాడు.

Tags:    
Advertisement

Similar News