జగన్ కు అలా... లోకేష్ కు ఇలా..!

ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల‌క్ష్మీపార్వ‌తిని రాజ్యాంగేతర శక్తిగా ప్రతిరోజూ వర్ణించేవి చంద్రబాబు అనుకూల పత్రికలు.  వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగేతరశక్తి అన్న పదాన్ని టీడీపీ నేతలు పదేపదే ఉచ్చరించేవారు. జగన్  ఒక రాజ్యాంగేతరశక్తిగా తయారయ్యాడని విమర్శించేవారు. అందులో నిజమెంతున్నది పక్కనపెడితే ఇప్పుడు టీడీపీ నేత లోకేష్ కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడని ఇదే టీడీపీ పత్రికలు రాస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను నారాలోకేష్ ప్రభావితం చేస్తున్నారని స్వయంగా టీడీపీ అనుకూల ప్రముఖ పత్రికే కథనం రాయడం […]

Advertisement
Update:2016-02-09 05:31 IST

ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల‌క్ష్మీపార్వ‌తిని రాజ్యాంగేతర శక్తిగా ప్రతిరోజూ వర్ణించేవి చంద్రబాబు అనుకూల పత్రికలు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగేతరశక్తి అన్న పదాన్ని టీడీపీ నేతలు పదేపదే ఉచ్చరించేవారు. జగన్ ఒక రాజ్యాంగేతరశక్తిగా తయారయ్యాడని విమర్శించేవారు. అందులో నిజమెంతున్నది పక్కనపెడితే ఇప్పుడు టీడీపీ నేత లోకేష్ కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడని ఇదే టీడీపీ పత్రికలు రాస్తున్నాయి.

ప్రభుత్వ నిర్ణయాలను నారాలోకేష్ ప్రభావితం చేస్తున్నారని స్వయంగా టీడీపీ అనుకూల ప్రముఖ పత్రికే కథనం రాయడం గమనార్హం. అయితే ఒకటే తేడా! ల‌క్ష్మీపార్వ‌తిని, జగన్ ని విలన్ గా చిత్రించిన ఆ పత్రికలు లోకేష్‌ను భావినాయకుడిగా తీర్చిదిద్దే ఎజెండాలో భాగంగా ఆ కథనం రాసినట్టు ఉంది. విషయం ఏమిటంటే… దీక్ష విరమించేందుకు ముద్రగడ పెట్టిన షరతుల పరిష్కారంలో చిక్కుముడి ఏర్పడగా లోకేష్‌ పరిష్కరించారట. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ఈఏడాది కాపు కార్పొరేషన్‌కు మరో వంద కోట్లు మాత్రమే కేటాయించగలమని ప్రభుత్వం స్పష్టంచేసిందట.

కానీ విషయం తెలుసుకున్న లోకేష్ జోక్యం చేసుకుని ఆ మొత్తాన్ని 500 కోట్లకు పెంచేలా అప్పటికప్పుడు చేశారని టీడీపీ పత్రిక కథనం. కాపులకు రూ. 500 కోట్లు ఇవ్వడాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ లోకేష్ ఎవరు?. ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు చేయాలన్నది ఆయన ఎలా నిర్దేశిస్తారు?. చంద్రబాబు తండ్రే అయిఉండవచ్చు… కానీ అది ఇంటి వరకే. సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారాల్లోకి లోకేష్ ఎలా జోక్యం చేసుకుంటారు?. లోకేష్‌ మంత్రి కాదు, ప్రభుత్వ సలహాదారు కాదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఇలా అధికార చర్యల్లోకి ఎలా జోక్యం చేసుకుంటారు.

లోకేష్ చెప్పగానే రూ. 400 కోట్లు అదనంగా ఎలా కేటాయిస్తారు?. ఒకప్పుడు రాజ్యాంగతేర శక్తి అన్న పదం వాడకుండా బతకలేకపోయిన మీడియా సంస్థలు ఇప్పుడెందుకు మూగబోయాయి. పైగా లోకేష్ ఘనకార్యం చేశారంటూ కథనాలు. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. చంద్రబాబుపై ఇటీవల కాపుల్లో బాగా వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్‌కు కాపులను దగ్గర చేసేందుకు ఈ ప్రయోగం కూడా చేసి ఉండవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News