విలన్లతో కాదు...హీరోలే ఒకరితో ఒకరు తలపడుతున్నారు!
ఒకేసారి రెండుమూడు సినిమాలు రిలీజయితే వాటి తాలూకూ నిర్మాతలకు, దర్శకులకూ, నటీనటులకే కాదు, ప్రేక్షకులకు సైతం ఉత్కంఠగానే ఉంటోంది. సినిమాల్లో కనిపించే సస్పెన్స్ కంటే వాటి విజయం తాలూకే సస్పెన్సే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి సినిమాల్లో ఉన్న కథల కంటే… అవి ఏ విధంగా విజయం సాధించాయి, ఏ హీరో ఏ హీరోని బీట్ చేశాడు, ఎవరి సినిమా ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసింది…అనేవి మరింత ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. జనవరిలో ఒకేసారి విడుదలైన […]
ఒకేసారి రెండుమూడు సినిమాలు రిలీజయితే వాటి తాలూకూ నిర్మాతలకు, దర్శకులకూ, నటీనటులకే కాదు, ప్రేక్షకులకు సైతం ఉత్కంఠగానే ఉంటోంది. సినిమాల్లో కనిపించే సస్పెన్స్ కంటే వాటి విజయం తాలూకే సస్పెన్సే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి సినిమాల్లో ఉన్న కథల కంటే… అవి ఏ విధంగా విజయం సాధించాయి, ఏ హీరో ఏ హీరోని బీట్ చేశాడు, ఎవరి సినిమా ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసింది…అనేవి మరింత ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. జనవరిలో ఒకేసారి విడుదలైన నాలుగు సినిమాల మధ్య పోటీని మీడియా పుణ్యమా అని సగటు ప్రేక్షకుడు బాగా ఎంజాయి చేశాడు. సంక్రాంతి పందెం కోళ్ల కంటే ఎక్కువగా ఈ సినిమాలు పోటీపడ్డాయి. తమ హీరో సినిమాలో విలన్లని చితక్కొట్టినప్పటికంటే ఎక్కువ ఆనందాన్ని అభిమానులు, తమ హీరో మరో హీరో సినిమాని బీట్ చేసినపుడు పొందారు…ఇందులో సందేహం లేదు. సినిమాలోని కల్పన కంటే మజా ఇచ్చే వాస్తవం ఇది మరి.
జనవరి తరువాత అలాంటి ఒక పోటీ తిరిగి ఏప్రిల్లో కనిపించేలా ఉంది. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు సమీపిస్తున్న దశలో తిరిగి నిర్మాతలు తమ సినిమాలను ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా ఏప్రిల్ 29న మహేస్‌బాబు బ్రహ్మోత్సవం రిలీజ్ కానుంది. అయితే అదేనెలలో కాస్తముందు 22వ తేదీన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అ, ఆని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇందులో నితిన్, సమంత హీరో హీరోయిన్లు. మహేష్, త్రివిక్రమ్ కలిస్తే మహా క్రేజ్. మరి ఇప్పుడు ఆ క్రేజ్‌ని చెరిసగం పంచుకోవాల్సి ఉంటుంది. ఇదే నెలలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కూడా వేసవి సెలవుల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ ఒకసారి స్టార్ హీరోలు ఒకరితో ఒకరు తలపడితే ఉండే స్పస్పెన్స్, ఎంజాయిమెంట్ ప్రేక్షకుడికి దక్కే అవకాశం ఉందన్నమాట. సినిమా కథల కంటే ఎక్కువగా మీడియా వండి వార్చే కథనాలు ప్రేక్షకులకు మంచి కాలక్షేపం కానున్నదన్నమాట.