బాబు పార్టీకి బానిసలు కారట..! అందుకే ఇలా చేశారట..!

సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పట్టునిలుపుకుంది. అందుకు కారణం సీమాంధ్ర ఓటర్లే.  విభజన తర్వాత ఏపీకి అనుభవస్తుడైన వ్యక్తి సీఎంగా ఉంటే మంచిదన్న భావన సీమాంధ్రలో వ్యక్తమైంది. అందుకే అక్కడ బాబుకు పట్టం కట్టారు. అదే సానుకూలత గ్రేటర్ పరిధిలోనూ పనిచేసి టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అప్పటి నుంచి సెటిలర్లంటే టీడీపీలో ఒకరకమైన భావన ఏర్పడింది. సెటిలర్లు అంటే టీడీపీ ఓటర్లు అని […]

Advertisement
Update:2016-02-06 05:30 IST

సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పట్టునిలుపుకుంది. అందుకు కారణం సీమాంధ్ర ఓటర్లే. విభజన తర్వాత ఏపీకి అనుభవస్తుడైన వ్యక్తి సీఎంగా ఉంటే మంచిదన్న భావన సీమాంధ్రలో వ్యక్తమైంది. అందుకే అక్కడ బాబుకు పట్టం కట్టారు. అదే సానుకూలత గ్రేటర్ పరిధిలోనూ పనిచేసి టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అప్పటి నుంచి సెటిలర్లంటే టీడీపీలో ఒకరకమైన భావన ఏర్పడింది.

సెటిలర్లు అంటే టీడీపీ ఓటర్లు అని వాళ్ల నమ్మకం. వారు టీడీపీకి తప్ప మరే పార్టీకీ ఓటేయరు అన్న భావన కలిగేలా ప్రచారం చేశారు. ఒక విధంగా హైదరాబాద్‌లోని సెటిలర్లు టీడీపికి బానిసలు… వారు కళ్లు మూసుకుని టీడీపీకే ఓటేస్తారన్న అభిప్రాయం కలిగించారు. కానీ గ్రేటర్‌లో టీడీపీకి అనుకూలంగా ఉండే వారే కాదు, టీడీపీ అంటే నచ్చని సీమాంధ్రులు కూడా చాలా మంది ఉన్నారు. కులాభిమానంతో ఓటేసే వారే కాదు ఆలోచించి ఓటేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ…

వారందరూ టీడీపీకే ఓటేస్తారన్న భావన కలిగించడం ద్వారా తెలంగాణవాళ్ల మనోభావాలను పరోక్షంగా టీడీపీ దెబ్బతీసింది. సెటిలర్లంతా టీడీపీకి అనుకూలమైనవారే అన్న ప్రచారం వల్ల తెలంగాణవాదులు హైదరాబాద్‌లోని సీమాంధ్రులను కలుపుకుపోయే ప్రయత్నం కూడా నెమ్మదించింది. సెటిలర్ల ఓటు బ్యాంకును టీడీపీ ఒకవిధంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాల కోసం వాడుకోవడం కూడా చాలా మంది సీమాంధ్ర ఓటర్లకు రుచించలేదు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయడం ద్వారా తాము ఏ పార్టీకీ బానిసలం కాదని… తాము స్వతంత్రులమని, చంద్రబాబుకన్నా కేసీఆర్ పాలన బాగుందని గ్రేటర్‌ సీమాంధ్ర సెటిలర్లు నిరూపించారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News