రేవంత్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అధికారపక్షానికి ఆత్మవిశ్వాసం వెయ్యి రెట్లు పెరిగినట్టు కనిపిస్తోంది.  గ్రేటర్‌ పరిధిలో సెటిలర్ల కారణంగా టీడీపీకి బలముందన్న భావన ఇన్ని రోజులు ఉండేది.  అందుకే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు వెళ్లేందుకు ఆచితూచీ వ్యవహరించారు. కానీ గ్రేటర్ ఫలితాలు చూసిన తర్వాత బస్తీమే సవాల్ అంటున్నారు వారు.  కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.  […]

Advertisement
Update:2016-02-06 04:23 IST

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అధికారపక్షానికి ఆత్మవిశ్వాసం వెయ్యి రెట్లు పెరిగినట్టు కనిపిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో సెటిలర్ల కారణంగా టీడీపీకి బలముందన్న భావన ఇన్ని రోజులు ఉండేది. అందుకే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు వెళ్లేందుకు ఆచితూచీ వ్యవహరించారు. కానీ గ్రేటర్ ఫలితాలు చూసిన తర్వాత బస్తీమే సవాల్ అంటున్నారు వారు.

కొద్ది రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మాధవరం కృష్ణారావు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని గ్రేటర్‌ ఎన్నికల సమయంలో రేవంత్ సవాల్ చేశారు. అయితే అప్పుడు ఆచితూచి స్పందించిన మాధవరం ఇప్పుడు సై అంటున్నారు.

సాధారణ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో టీడీపీకి 43 వేల ఓట్ల మెజారిటీ వస్తే… గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 45 వేల ఓట్ల మేర మెజారిటీ వచ్చిందన్నారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదన్నారు. టీడీపీ మాయమాటలు నమ్మకుండా సెటిలర్లు అభివృధ్దికి ఓటేశారన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఉత్తమకుమార్ రెడ్డి పోటీకి వచ్చినా సిద్ధమన్నారు. మాధవరం సవాల్‌కు టీడీపీ, కాంగ్రెస్‌లు ఎలా స్పందిస్తారో!

Click on image to Read

Tags:    
Advertisement

Similar News