ఆ కుర్రాడి వార్షికవేతనం 1.2 కోట్లు...అతని తండ్రి ఓ వెల్డర్!
అత్యంత భారీ విజయం అంటే ఇదే. ఏదో ఒక ఆటలోనో, పనిలోనో కాదు. జీవితంలోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు వాత్సల్య సింగ్ చౌహాన్. సంవత్సరానికి 1.2 కోట్ల రూపాయాల వేతనంతో ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతను ఖరగ్‌పూర్ ఐఐటిలో ఫైనిలియర్ కప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అతను ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2012 ఐఐటి ప్రవేశ పరీక్షలో చౌహాన్ 382వ ర్యాంకు సాధించాడు. బీహార్ […]
అత్యంత భారీ విజయం అంటే ఇదే. ఏదో ఒక ఆటలోనో, పనిలోనో కాదు. జీవితంలోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు వాత్సల్య సింగ్ చౌహాన్. సంవత్సరానికి 1.2 కోట్ల రూపాయాల వేతనంతో ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతను ఖరగ్‌పూర్ ఐఐటిలో ఫైనిలియర్ కప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అతను ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు.
2012 ఐఐటి ప్రవేశ పరీక్షలో చౌహాన్ 382వ ర్యాంకు సాధించాడు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా, బెగుసరాయిల్లో ప్రాథమిక చదువులు పూర్తి చేసిన వాత్సల్య సింగ్, ఆరుగురు తోబుట్టువుల్లో పెద్దవాడు. 21 ఏళ్ల ఈ ఔత్సాహిక ఇంజినీర్ ఈ ఏడాది అక్టోబరులో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగంలో చేరబోతున్నాడు. చౌహాన్ తండ్రి చంద్రకాంత్ సింగ్ చౌహాన్, ఖగారియాలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి రేణుదేవి హోం మేకర్. తమ కుమారుని చదువులకోసం లోన్ తీసుకున్నామని, అతను సాధించిన విజయంతో ఎంతో ఆనందంగా ఉన్నామని తండ్రి చంద్రకాంత్ అంటున్నాడు. వాత్సల్య సింగ్ తమ్ముడు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌కి, చెల్లెలు ఎంబిబిఎస్ ఎంట్రెన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.
తననుండి సలహాలు, సూచనలు కావాలనుకున్న వారు ఎవరైనా తనను ఫేస్‌బుక్, ఇ మెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని వాత్సల్య సింగ్ చెప్పాడు. తెలివితేటలు, పట్టుదల ఉంటే ఎవరైనా అత్యున్నత స్థాయికి చేరవచ్చని నిరూపించిన ఈ యువకుడిని మనమూ అభినందిద్దాం.