బాబు గారి మీడియా భలే భలే " అదేమైనా జగన్ అత్తారిల్లా?
రాష్ట్రంలో చంద్రబాబుకు మరీ ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడిన సమయంలో టీడీపీ అనుకూల మీడియా వేస్తున్న ఎత్తులు భలేగా ఉన్నాయి. గురువారం టీడీపీ అనుకూల పత్రిక ఒకటి జగన్ కేసుల గురించి పెద్ద కథనం రాసింది. ఆస్తుల కేసులో జగన్‌ను ఈడీ విచారించబోతోందని ఇందు కోసం గురువారం తమ ముందు హాజరుకావాల్సిందిగా విచారణ సంస్థ ఆదేశించిందని కథనం. అంతవరకూ బాగానే ఉంది. పనిలోపనిగా జగన్ అరెస్ట్‌కు అవకాశం కూడా ఉందంటూ వైసీపీ శ్రేణుల్లో కాసింత అలజడి సృష్టించే మసాలా కూడా […]
రాష్ట్రంలో చంద్రబాబుకు మరీ ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడిన సమయంలో టీడీపీ అనుకూల మీడియా వేస్తున్న ఎత్తులు భలేగా ఉన్నాయి. గురువారం టీడీపీ అనుకూల పత్రిక ఒకటి జగన్ కేసుల గురించి పెద్ద కథనం రాసింది. ఆస్తుల కేసులో జగన్‌ను ఈడీ విచారించబోతోందని ఇందు కోసం గురువారం తమ ముందు హాజరుకావాల్సిందిగా విచారణ సంస్థ ఆదేశించిందని కథనం. అంతవరకూ బాగానే ఉంది. పనిలోపనిగా జగన్ అరెస్ట్‌కు అవకాశం కూడా ఉందంటూ వైసీపీ శ్రేణుల్లో కాసింత అలజడి సృష్టించే మసాలా కూడా కలిపేసింది. తీరా చూస్తే గురువారం ఈడీ ముందుకు కాదు కదా… అసలు జగన్ ఢిల్లీకి కూడా వెళ్లలేదు. అసలు జగన్‌ను ఈడీ పిలువ లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంతలోనే శుక్రవారం అదే పత్రిక కొత్త పల్లవిని అచ్చేయడాన్ని వైసీపీ శ్రేణులు పోల్చి చూపుతున్నాయి.
నిజానికి ఈడీ జగన్‌ను విచారణకు పిలిచిందని కానీ జగనే వెళ్లలేదని లేటెస్ట్‌గా పత్రిక రాసింది. అంతేకాదు కేవలం విచారణ అన్న ఒకే పని మీద ఢిల్లీ వస్తే బాగోదన్న ఉద్దేశంతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నాడని సెలవిచ్చింది. అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని బాగా ప్రచారం జరిగే సరికి జగన్ వెనక్కు తగ్గారని కూడా సదరు మీడియా సంస్థ కథనం చెబుతోంది. ఇక్కడే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలిగేది.
ఈడీ ఏమైనా జగన్ సొంత సంస్థనా?. తనకు ఈరోజు రావడానికి వీలుకాదంటే సరే అని సర్దుకుపోవడానికి!. నిజంగా ఈడీ విచారణకు పిలిచి ఉంటే, జగన్ వెళ్లకుండా డుమ్మాకొట్టడం సాధ్యమయ్యే పనేనా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతోందని… ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఎత్తుగడ వేశారని అంటున్నారు. మరో విషయం కూడా వారు గుర్తు చేస్తున్నారు.
నెల రోజుల క్రితం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారని ఇదే పత్రిక రాసిందని గుర్తు చేస్తున్నారు. ఆ మరుసటి రోజు అదే ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి జగన్ బెదిరించారని… దీంతో పార్టీ మారే అంశంలో ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గారని ఆది, అంతం రెండూ ప్రచురించిందని చెబుతున్నారు.
Click on image to Read