ఎక్స్ ప్రెస్ రాజా గెలిచాడా..!
ముగ్గురు సూపర్ స్టార్స్ నడుమ లేగ దూడలా వచ్చిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. సంక్రాంతి పండగ రేసులో బాలయ్య డిక్టేటర్ తోను.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. సొగ్గాడే చిన్నినాయనా అంటూ నాగార్జున ఇలా ముగ్గురు స్టార్స్ బరిలో వుంటే .. వేరే ఏ చిన్న హీరో కనీసం ఒక రెండు వారల పాటు తమ సినిమా రిలీజ్ వాయిదా వేసుకోకుండ వుండరు. కానీ శర్వానంద్, మేర్లపాక గాంధీ మాత్రం ఎక్స్ ప్రెస్ రాజను ఈ ముగ్గురి […]
Advertisement
ముగ్గురు సూపర్ స్టార్స్ నడుమ లేగ దూడలా వచ్చిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. సంక్రాంతి పండగ రేసులో బాలయ్య డిక్టేటర్ తోను.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. సొగ్గాడే చిన్నినాయనా అంటూ నాగార్జున ఇలా ముగ్గురు స్టార్స్ బరిలో వుంటే .. వేరే ఏ చిన్న హీరో కనీసం ఒక రెండు వారల పాటు తమ సినిమా రిలీజ్ వాయిదా వేసుకోకుండ వుండరు. కానీ శర్వానంద్, మేర్లపాక గాంధీ మాత్రం ఎక్స్ ప్రెస్ రాజను ఈ ముగ్గురి స్టార్స్ చిత్రాలతో పోటి లో ఉంచాడు.
అయితే విమర్శకులు ముందుగా అంచన వేసినట్లే..ఎక్స్ ప్రెస్ రాజాలో కంటెంట్.. సినిమాను ఆద్యంతం దర్శకుడు నడిపిన విధానం.. శర్వానంద్ యాక్టింగ్.. వెరసీ ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునేలా ఉన్నాయి. వంద శాతం ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం శర్వానంద్ కు కొత్త సినిమా అని చెప్పాలి. అన్ని విధాల కొత్తదనం ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాలో శర్వ డాన్స్ లు బాగా చేయడం మరో విశేషం. ఓవరాల్‌గా సంక్రాంతి పండగ బరిలో మూడు పెద్ద చిత్రాల మధ్యలో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజా మంచి లాభాలతో బయ్యర్లును ఖుషి చేస్తుందనే చెప్పాలి. కంటెంట్‌ను నమ్ముకుంటే చిన్న సినిమా అయినా పెద్ద చిత్రాల ధాటికి ఎదురొడ్డగలదనడానికి ఎక్స్ ప్రెస్ రాజ చిత్రమే ఒక ఎగ్జాంపుల్ మరి.
Advertisement