డైరెక్షన్‌ బాబు‌దే

వైసీపీ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం వరుసపెట్టి కేసులు నమోదు చేస్తుండడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నెల్లూరు జైలులో ఉన్న ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, మరోనాయకుడు మధుసూధన్‌ రెడ్డిలను జగన్ పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జగన్‌ హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిని జిల్లాలో అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై […]

Advertisement
Update:2016-01-21 09:30 IST

వైసీపీ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం వరుసపెట్టి కేసులు నమోదు చేస్తుండడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నెల్లూరు జైలులో ఉన్న ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, మరోనాయకుడు మధుసూధన్‌ రెడ్డిలను జగన్ పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జగన్‌ హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిని జిల్లాలో అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై మిథున్ రెడ్డి దాడి చేసి ఉంటే వెంటనే సీఐఎస్‌ఎఫ్ కేసు నమోదు చేసేదని… కానీ చంద్రబాబు తిరుపతి వచ్చి ఒత్తిడి చేసిన తర్వాతే మిథున్ రెడ్డిపై కేసు నమోదైందన్నారు. ఏపీలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News