యాపిల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళుతున్నారా...ఈ ప్రశ్నలు అడగొచ్చు!
కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేయడం అంటే అదొక క్రెడిట్‌గా, జీవితానికి ఒక అదనపు హంగుగా భావిస్తుంటారు చాలామంది. గూగుల్, యాపిల్, విప్రో ఇలాంటి పేర్లు నిరుద్యోగులను ఊరిస్తుంటాయి. మరి అలాంటి కంపెనీల్లో ఉద్యోగం రావాలంటే ఒక టఫ్ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సిందే. అయితే ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక సమాధానంగా… యాపిల్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లినవారిని అడిగిన కొన్ని విచిత్రమైన ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి. […]
కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేయడం అంటే అదొక క్రెడిట్‌గా, జీవితానికి ఒక అదనపు హంగుగా భావిస్తుంటారు చాలామంది. గూగుల్, యాపిల్, విప్రో ఇలాంటి పేర్లు నిరుద్యోగులను ఊరిస్తుంటాయి. మరి అలాంటి కంపెనీల్లో ఉద్యోగం రావాలంటే ఒక టఫ్ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సిందే. అయితే ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక సమాధానంగా… యాపిల్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లినవారిని అడిగిన కొన్ని విచిత్రమైన ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చదువు, నైపుణ్యాలకంటే ఎక్కువగా అభ్యర్థిలోని సాధారణ తెలివితేటలను, కామన్ సెన్స్‌ని కొలిచేవిగా ఉండటమే విచిత్రం. అవేంటో చూడండి-
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుకోసం వచ్చిన వారికి: మీ దగ్గర రెండు గుడ్లు ఉంటే వాటిని పగల కొట్టకుండా ఎందులో ఎక్కువ సొన ఉంది అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటారు. ఇందుకు సరైన పద్ధతి ఏంటి?
- ఫ్యామిలీ రూము స్పెషలిస్ట్ పోస్టు: మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: ఒక ఆసక్తికరమైన సమస్యని వివరించండి, అలాగే దాన్ని మీరు ఎలా పరిష్కరించారో చెప్పండి?
- యాపిల్ ఎట్ హోమ్ అడ్వయిజర్: ఎనిమిదేళ్ల వయసున్న పిల్లాడికి మోడెమ్ లేదా రూటర్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను వివరించాలంటే ఎలా చెబుతారు?
- గ్లోబల్ సప్లయి మేనేజర్ పోస్టు: రోజుకి ఎంతమంది పిల్లలు జన్మిస్తున్నారు?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: ఒక టేబుల్ మీద వంద నాణాలు ఉన్నాయి. అందులో పది హెడ్‌వైపు తొంభై టైల్ వైపు అమర్చి ఉన్నాయి. వాటిని చేత్తో తాకకుండా, కళ్లతో చూడకుండా రెండు గ్రూపులుగా విడగొట్టాలి. అయితే ప్రతి గ్రూపులోనూ సమానంగా హెడ్స్ ఉండాలి.
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: మిమ్మల్ని ఉత్తేజపరచేది ఏంటి..వివరించండి?
- సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎస్యూరెన్స్ ఇంజినీర్: మీ ముందు మూడు బాక్సులున్నాయి. ఒక దాంట్లో మొత్తం యాపిల్స్, మరొకదాంట్లో పూర్తిగా ఆరెంజ్‌లు, మూడోదాంట్లో అవి కొన్ని, ఇవి కొన్ని ఉన్నాయి. వాటికి లేబుల్స్ ఉన్నాయి కానీ అవి కరెక్ట్‌గా లేవు. ఇప్పుడు మీరు ఒక పెట్టెలోంచి లోపలికి చూడకుండా ఒక పండుని తీయాలి. దాన్ని చూసి మూడు పెట్టెల్లో ఎందులో ఏమున్నాయో వెంటనే చెప్పగలగాలి. అది ఎలా సాధ్యమో చెప్పండి?
- స్పెషలిస్ట్: ఒక కోపిష్టి అయిన మహిళా కస్టమర్ మన షోరూమ్‌కి వచ్చింది. ఇరవై నిముషాలుగా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె కోపంతో లేచి మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ స్టోర్‌కి వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఆమెని సముదాయించి, బయటకు వెళ్లకుండా ఆపాలి…ఏం చేస్తారు?
- యాపిల్ కేర్ ఎట్ హోమ్ కన్సల్టెంట్: ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఒక పాత కంప్యూటర్ ఉంది. అది ఒక రాయిలా ఎందుకూ పనికిరాదని మీకు అర్థమైంది…ఏం చేస్తారు?
- బిల్డ్ ఇంజినీర్: మీరు స్మార్ట్ అనుకుంటున్నారా?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: మీ ఫెయిల్యూర్స్ ఏంటి? వాటి నుండి ఏం నేర్చుకున్నారు?
- మెకానికల్ ఇంజినీర్ పోస్టు: ఒక రికార్డ్ టర్న్ టేబుల్ మీద నీళ్ల గ్లాసుని ఉంచాం. నిదానంగా దాని స్పీడుని పెంచుతూ పోయినపుడు గ్లాసు పక్కకు ఒరుగుతుందా? కిందపడిపోతుందా? లేదా నీళ్లు చిమ్ముతాయా? ముందు ఏం జరుగుతుంది?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు:….మీ జీవితంలో మీరు చేసిన మంచి పని… మీకు గర్వకారణంగా అనిపించినది ఏంటి?
- సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోస్టు….మేము మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి?
- సాఫ్ట్ వేర్ ఇంజినీర్; మీలో సృజనాత్మకత ఉందా..అలాంటి ఒక ఆలోచనని చెప్పండి?
- యాపిల్ రిటైల్ స్పెషలిస్ట్: ఒక అవమానవరమైన అనుభవం గురించి వివరించండి?
- స్పెషలిస్ట్: యాపిల్ కంప్యూటర్స్ అనే పేరుని యాపిల్ ఇంక్‌గా ఎందుకు మార్చారు?
- ఫ్యామిలీ రూము స్పెషలిస్ట్ : మీరు చాలా పాజిటివ్‌గా కనబడుతున్నారు? అయితే ఏ విషయాలు మీలోని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఏంటి?
- ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజర్: గత నాలుగు సంవత్సరాల్లో మీ జీవితంలో ఒక మంచిరోజు…అలాగే ఒక వరస్ట్ రోజుని గురించి చెప్పండి?
- స్పెషలిస్ట్ పోస్టు కోసం: యాపిల్ స్టోరులోకి వెళ్లినపుడు మీకు మొట్టమొదట అనిపించేదేమిటి? మీ మొదటి ఫీలింగ్?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టు: వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారు?
- సాఫ్ట్‌వేర్ క్వాలిటీ ఎస్యూరెన్స్ ఇంజినీర్: ఒక టోస్టర్ (ఫుడ్) రుచిగా ఉంటుందని ఎలా టెస్ట్ చేస్తారు?