తంబీల తిప్పలు- జల్లికట్టుకు సుప్రీం నో

జల్లికట్టు నిర్వాహకులకు సుప్రీంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జల్లికట్టుపై విధించిన స్టే ఎత్తివేయడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. జల్లికట్టుపై కేంద్రం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా కోర్టు ఇటీవల స్టే విధించింది. దీన్ని ఎత్తివేయాలంటూ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్లను విచారించిన కోర్టు వాటిని కొట్టివేసింది. కనీసం ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటైనా జల్లికట్టుకు అనుమతివ్వాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా కోర్టు సమ్మతించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లికట్టుకు అనుమివ్వబోమని స్పష్టం చేసింది. అయితే […]

Advertisement
Update:2016-01-13 11:39 IST

జల్లికట్టు నిర్వాహకులకు సుప్రీంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జల్లికట్టుపై విధించిన స్టే ఎత్తివేయడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. జల్లికట్టుపై కేంద్రం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా కోర్టు ఇటీవల స్టే విధించింది. దీన్ని ఎత్తివేయాలంటూ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్లను విచారించిన కోర్టు వాటిని కొట్టివేసింది. కనీసం ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటైనా జల్లికట్టుకు అనుమతివ్వాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా కోర్టు సమ్మతించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లికట్టుకు అనుమివ్వబోమని స్పష్టం చేసింది. అయితే జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ కేంద్రంపై తమిళ ప్రభుత్వంతో పాటు అక్కడి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News