మరోసారి మహా దాతగా ఖ్యాతికెక్కిన అజిం ప్రేమ్‌జి
విప్రో వ్యవస్థాపకుడు అజిం ప్రేమ్‌జి మరోసారి మానవతావాదిగా, దాతగా తనపేరుని నిలుపుకున్నారు. విలాసవంతమైన జీవన శైలిపై ప్రచురణలు చేసే చైనా సంస్థ హురున్ ప్రకటించిన ఇండియా దాతల లిస్టులో ఆయన మొదటిస్థానంలో ఉన్నారు. ఒక్కొక్కరు 10కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చిన 36మంది ఈ లిస్టులో ఉన్నారు. అయితే లిస్టులో ఉన్నవారందరూ కలిపి ఇచ్చిన డొనేషన్లలో 80శాతం ప్రేమ్‌జి ఒక్కరే ఇచ్చారు. ఆయన 27,514కోట్ల రూపాయలను విద్యా రంగంలో సేవలకు ప్రకటించారు. అజిం ప్రేమ్‌జి షౌండేషన్ నుండి ఇస్తున్న […]
విప్రో వ్యవస్థాపకుడు అజిం ప్రేమ్‌జి మరోసారి మానవతావాదిగా, దాతగా తనపేరుని నిలుపుకున్నారు. విలాసవంతమైన జీవన శైలిపై ప్రచురణలు చేసే చైనా సంస్థ హురున్ ప్రకటించిన ఇండియా దాతల లిస్టులో ఆయన మొదటిస్థానంలో ఉన్నారు. ఒక్కొక్కరు 10కోట్ల రూపాయలకు పైగా దానమిచ్చిన 36మంది ఈ లిస్టులో ఉన్నారు. అయితే లిస్టులో ఉన్నవారందరూ కలిపి ఇచ్చిన డొనేషన్లలో 80శాతం ప్రేమ్‌జి ఒక్కరే ఇచ్చారు. ఆయన 27,514కోట్ల రూపాయలను విద్యా రంగంలో సేవలకు ప్రకటించారు. అజిం ప్రేమ్‌జి షౌండేషన్ నుండి ఇస్తున్న ఈ విరాళాలను ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 3,50,000 స్కూళ్లకోసం వినియోగిస్తారు.
నవంబరు 2014నుండి అక్టోబరు 2015 వరకు సంవత్సరం పాటు భారత్‌లోని 300 మంది ఐశ్వర్యవంతులు, ధనవస్తు రూపాల్లో ఇచ్చిన విరాళాలను పరిశీలించి హురున్ ఈ లిస్టుని విడుదల చేసింది. ప్రేమ్‌జి ఇచ్చిన ఈ అత్యధిక మొత్తంతో విరాళాల సగటు 300కోట్ల నుండి 900 కోట్ల రూపాయలకు పెరిగిందని హురున్ పేర్కొంది. అయితే గత ఏడాది ఈ దాతల లిస్టు 50 ఉండగా అది ఈ ఏడాది 36కి పడిపోయిందని తెలిపింది. ప్రేమ్‌జి తరువాత ఈ లిస్టులో నందన్, రోహిణి నీలేకని (2,404 కోట్లు), ఎన్.ఆర్ నారాయణ మూర్తి (1,322కోట్లు), కె దినేష్ అండ్ ఫ్యామిలీ (1,238కోట్లు) తదితరులు ఉన్నారు.
అందుకే మన దేశంలో దానధర్మాలు తక్కువ
మనదేశంలో సంపన్నులు ఎక్కువగానే ఉన్నా సామాజిక ప్రయోజనాలకోసం వారు చేసే కేటాయింపులు చాలా తక్కువ. అమెరికాలో సేవాకార్యక్రమాలకు అధికమొత్తంలో ఖర్చుపెడుతుంటారు. ఇందుకు కారణాలను వివరిస్తూ ప్రేమ్‌జి, మనదేశంలో కుటుంబాలు చాలా పెద్దవి. అందుకే ఆస్తులను పంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, అలాగే పెద్దలు సంపాదించినది తప్పనిసరిగా పిల్లలకు వారసత్వంగా చెంది తీరాలి…అనేది మన సంప్రదాయం అందుకే మనదేశంలో సామాజిక సేవకు ఇచ్చే దానాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నారు. తాను ఈ విధమైన సామాజిక సేవని చాలా ఆలస్యంగా మొదలుపెట్టానంటున్నారు ప్రేమ్‌జి. 1999లో అజిం ప్రేమ్‌జి ఫౌండేషన్‌ని స్థాపించారాయన. ముంబయిలో పేద పిల్లలకోసం చిల్డ్రన్స్ ఆర్థోపెడిక్ ఆసుపత్రిని నిర్వహించిన తన తల్లే తనకు సేవాగుణంలో మార్గదర్శి అని ప్రేమ్‌జి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.