ప్ర‌యివేటీక‌ర‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు విద్య‌, వైద్యం అందించ‌లేము!

ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడు అమ‌ర్త్య‌సేన్‌ భార‌త‌దేశ‌పు ఆర్థిక శాస్త్ర నిపుణుడు,  నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ అమ‌ర్త్య‌సేన్, ఎన్‌డిఎ ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌పై మ‌రొక‌సారి మాట్లాడారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌నితీరు చాలా నిదానంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల మేర‌కు సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్ట‌లేక‌పోయింద‌ని, అది మార్కెట్ ఎకాన‌మీని దెబ్బ‌తీసింద‌ని అభిప్రాయ ప‌డ్డారు. అమ‌ర్త్య‌సేన్ వెల్ల‌డించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఆర్థిక, ప్ర‌జా సంబంధ అంశాలు మీకోసం- స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌ని రాయితీల‌ను ర‌ద్దు చేయ‌డంలో ఎన్‌డిఎ ప్ర‌భుత్వం […]

Advertisement
Update:2016-01-10 09:40 IST

ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడు అమ‌ర్త్య‌సేన్‌

భార‌త‌దేశ‌పు ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ అమ‌ర్త్య‌సేన్, ఎన్‌డిఎ ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌పై మ‌రొక‌సారి మాట్లాడారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌నితీరు చాలా నిదానంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల మేర‌కు సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్ట‌లేక‌పోయింద‌ని, అది మార్కెట్ ఎకాన‌మీని దెబ్బ‌తీసింద‌ని అభిప్రాయ ప‌డ్డారు. అమ‌ర్త్య‌సేన్ వెల్ల‌డించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఆర్థిక, ప్ర‌జా సంబంధ అంశాలు మీకోసం-

  • స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌ని రాయితీల‌ను ర‌ద్దు చేయ‌డంలో ఎన్‌డిఎ ప్ర‌భుత్వం యుపిఎ కంటే వేగంగా స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
  • అభివృద్ధి వేగం పెర‌గాలంటే సంస్క‌ర‌ణ‌లు చాలా అవ‌స‌రం.
  • ఆర్థిక శాస్త్ర విధానాల్లో అనేక మార్పులు వ‌చ్చాయి. ఆర్థిక గ‌ణాంకాల‌ను, గ‌ణాంకాల‌తో నిమిత్తంలేని వాస్త‌వ ప‌రిస్థితుల‌ను క‌లిపి చూడాల‌ని అర్థం చేసుకున్నాం. ఈ రెండింటినీ క‌లిపి చూడాల‌నే అంటాను నేను.
  • ఆర్థిక శాస్త్రం అందిస్తున్న మూడు పాఠాల‌ను మ‌నం స‌రిగ్గా వినియోగించుకోలేక‌పోతున్నాం. మొద‌టిది మార్కెట్ ఎకాన‌మీని వేగంగా అభివృద్ధి బాట ప‌ట్టించ‌డం. అందుకు కావ‌ల‌సిన సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ చాలా నిదానంగా ఉంది. రెండ‌వ‌ది ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయంలో భారీ అభివృద్ధి సాధ్య‌మైతే, త‌రువాత ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమంపై దృష్టి పెట్టాల్సి ఉంది. 1776లో ఆడ‌మ్ స్మిత్ చెప్పిన‌ది ఇదే. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఈ విష‌యంలో యుపిఎ ప్ర‌భుత్వం సాధించిన‌ది ఏమీ లేదు, ఎన్‌డిఎ అంత‌క‌న్నా ఘోరంగా విఫ‌ల‌మైంది.
  • వినియోగ‌దారుల‌కు మార్కెట్‌లో తాము కొంటున్న వ‌స్తువుల ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న‌ని క‌లిగించ‌డం అనేది మూడవ అంశం. అది కూడా మ‌న ద‌గ్గ‌ర ఏమాత్రం స‌వ్యంగా లేదు. ఆరోగ్య రంగాన్ని ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డంలోనూ ఇది స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది. ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్య బాధ్య‌త‌ని ఏమాత్రం తీసుకోకుండా, ఒకేసారి ప్రాథ‌మిక స్థాయి నుండి హెల్త్ కేర్‌ని ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌డం అనేది ఇండియాలోనే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డా సాధ్య‌ప‌డ‌దు. దేశ‌మంతా ఒకే ర‌క‌మైన సాధార‌ణ విద్యా, వైద్య విధానాల‌ను ప్ర‌యివేటు రంగం ద్వారా అమ‌లు చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. ప్ర‌పంచంలో మ‌రే దేశ‌మూ ఇలా చేయ‌డం లేదు.
  • జ‌పాన్, అమెరికా, యూర‌ప్‌, చైనా, వియ‌త్నాం, క్యూబా, హాంకాంగ్‌, సింగ‌పూర్‌…ఈ దేశాల‌న్నీ… వారు క‌మ్యునిస్టులు అయినా ఇత‌ర ప్ర‌భుత్వాలు అయినా, సాధార‌ణ విద్య వైద్యం అందించాల్సిన బాధ్య‌త త‌మ‌దే అని గుర్తించాయి. మ‌న‌దేశ‌మే గుర్తించ‌లేదు.
  • అర్థ‌శాస్త్రంలో అంకెలు, థియ‌రీ రెండూ ముఖ్య‌మే. అర్థ‌శాస్త్రం చిట్ట‌చివ‌రికి మ‌న జీవితాన్ని ప్ర‌తిబింబిస్తుంది. మ‌న జీవితం గురించే చెబుతుంది. అందుకే థియ‌రీ ముఖ్య‌మంటున్నాను.
  • ఆర్థిక పెట్టుబ‌డుల విష‌యంలో విజ‌య‌వంతంగా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకోవ‌డం ఒక్క‌టే అభివృద్ధి కాదు, ప్ర‌జ‌లకు విద్య‌, వైద్యం, సామాజిక భ‌ద్ర‌త ఇవి స‌మృద్ధిగా ల‌భించిన‌పుడే దాన్ని అభివృద్ధిగా భావించాలి. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం పూర్తిచేసుకున్న‌ప్పుడు కాదు, ప్ర‌భుత్వపాల‌న మొద‌లైన స‌మ‌యంలోనూ ఈ విష‌యంలో ప‌రిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇప్ప‌టికీ అలాగే ఉన్నాయి. ఇందులో నా అభిప్రాయంలో ఎలాంటి మార్పులేదు. విద్య‌, వైద్య రంగాల‌ను యుపిఎ ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. మోడీ ప్ర‌భుత్వం దానికి కొన‌సాగింపులా ఉంది.
  • భార‌త ప్ర‌జ‌ల‌కు విద్య‌, ఆరోగ్యం, సామాజిక భ‌ద్ర‌త అంద‌డం లేద‌నేది వాస్త‌వం. ప్ర‌జా జీవితాలు ఇలా ఉన్న‌పుడు స్కిల్ ఇండియా, ప్ర‌ధాన్‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న లాంటి ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టినా, అవి కేవ‌లం కొత్త‌గా ధ్వ‌నిస్తాయే త‌ప్ప, ప్ర‌జ‌ల జీవితాల్లో కొత్త మార్పు ఏమీ తీసుకురావు. మ‌న‌దేశంలో ఉన్న‌ది విద్య‌, వైద్య స‌దుపాయాలు లేని శ్రామిక వ‌ర్గం. వారి ద్వారా ఆదాయాన్ని పెంచ‌డం, అభివృద్ధికి బాట‌లు వేయ‌డం అనేవి సాధ్యం కాని ప‌నులు.
  • ఎల్‌పిజి స‌బ్సిడీని ఎత్తివేయాలని నేను ఇంత‌కుముందు రాసిన పుస్త‌కంలోనే చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. ఎల్‌పిజి మీద ఉన్న అన్ని ర‌కాల స‌బ్సిడీల‌ను ఎత్తివేయాలి. అది ఇప్ప‌టికీ జ‌ర‌గ‌లేదు. అస‌లు క‌రెంటే అంద‌ని ప్రాంతాల్లోనూ ప‌వ‌ర్ స‌బ్సిడీ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. క‌రెంటు ఉన్న‌వారికి స‌బ్సిడీలు అందుతున్నాయి క‌దా…అనుకోవ‌డం స‌రైన విష‌యం కాదు. స‌బ్సిడీల‌ను నేరుగా బ్యాంకు ఎకౌంట్ల‌లో వేయ‌డం వ‌ల‌న ఆ డ‌బ్బు ఇంట్లో ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు కాకుండా మ‌గ‌పిల్ల‌ల‌కు మాత్ర‌మే చేర‌గ‌ల అవ‌కాశం ఉంది. ఇలా ఇందులో పాజిటివ్‌, నెగ‌టివ్ రెండూ ఉన్నాయి.
  • కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన స‌రి బేసి సంఖ్య‌ల విధానం గురించి నేను ఎక్కువ‌గా ఆలోచించ‌లేదు.
  • స‌గం భార‌త‌దేశం స్కూలు విద్య‌కు నోచుకోని పరిస్థితుల్లో ఉంది. ఇలాంట‌పుడు ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ గురించి ఇంత‌గా మాట్లాడ‌టం, ఇంట‌ర్‌నెట్ పై దృష్టి పెట్ట‌డం పూర్తిగా అనుచితం
Tags:    
Advertisement

Similar News