హర్వర్డ్ యునివర్సిటిలో కమల్ ప్రసంగం
నటనలో, ఆలోచనా విధానంలో, మార్గనిర్దేశకంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌కు సాటి ఎవరూ లేరన్నది అందరూ అంగీకరించే విషయం. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ సినీ యవనికపై బలమైన ముద్ర వేసిన కమల్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న భారతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా కమల్‌హాసన్‌కు ఆహ్వానం అందింది. దక్షిణాది నుండి ఈ అహ్వానం అందుకున్న తొలి నటుడు కమల్. తద్వారా మరోమారు భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచారు. ఫిబ్రవరి మొదటి […]
Advertisement
నటనలో, ఆలోచనా విధానంలో, మార్గనిర్దేశకంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌కు సాటి ఎవరూ లేరన్నది అందరూ అంగీకరించే విషయం. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ సినీ యవనికపై బలమైన ముద్ర వేసిన కమల్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న భారతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా కమల్‌హాసన్‌కు ఆహ్వానం అందింది. దక్షిణాది నుండి ఈ అహ్వానం అందుకున్న తొలి నటుడు కమల్. తద్వారా మరోమారు భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరుగనున్న హార్వర్డ్ భారతీయ సదస్సులో ‘అవకాశాలు – సవాళ్లు’ అనే అంశంపై కమల్ ప్రసంగించనున్నారని సమాచారం.
Advertisement