టీఆర్‌ఎస్ స్టీరింగ్‌ సంగతి మాకు తెలుసు

గ్రేటర్ హైదరాబాద్‌లో తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తామూ సర్వేలు చేయించామని టీడీపీ- బీజేపీ కూటమికి 80-85 స్థానాలు వస్తాయన్నారు. ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్- ఎంఐఎం, టీడీపీ- బీజేపీ కూటమి మధ్య ఉంటుందన్నారు రేవంత్. టీఆర్ఎస్‌ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఈ విషయాన్ని అసదుద్దీనే ఒకసారి స్వయంగా చెప్పారన్నారు. పార్టీ ఫిరాయింపులను నమ్ముకుని విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అలాంటి […]

Advertisement
Update:2016-01-07 11:33 IST

గ్రేటర్ హైదరాబాద్‌లో తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తామూ సర్వేలు చేయించామని టీడీపీ- బీజేపీ కూటమికి 80-85 స్థానాలు వస్తాయన్నారు. ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్- ఎంఐఎం, టీడీపీ- బీజేపీ కూటమి మధ్య ఉంటుందన్నారు రేవంత్. టీఆర్ఎస్‌ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఈ విషయాన్ని అసదుద్దీనే ఒకసారి స్వయంగా చెప్పారన్నారు. పార్టీ ఫిరాయింపులను నమ్ముకుని విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అలాంటి నీచ రాజకీయాలు ఫలించవన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ 300 కోట్లు ఖర్చు చేయబోతోందని రేవంత్ ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News