బాలయ్య విషయంలో వెనక్కి తగ్గిన నాని

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని ఒక విలక్షణమైన పాత్ర చేస్తున్నాడు. ఇందులో హీరో బాలకృష్ణకి వీరాభిమానిగా నాని కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ పెట్టాలని అనుకున్నారు. దీని కోసమని నాని తన చేతిపై ‘జై బాలయ్య’ అనే టెంపరరీ టాటూ కూడా వేయించుకున్నాడు. కానీ ‘జై బాలయ్య’ అని టైటిల్‌ పెడితే బాలకృష్ణ […]

Advertisement
Update:2016-01-06 20:36 IST

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని ఒక విలక్షణమైన పాత్ర చేస్తున్నాడు. ఇందులో హీరో బాలకృష్ణకి వీరాభిమానిగా నాని కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ పెట్టాలని అనుకున్నారు. దీని కోసమని నాని తన చేతిపై ‘జై బాలయ్య’ అనే టెంపరరీ టాటూ కూడా వేయించుకున్నాడు. కానీ ‘జై బాలయ్య’ అని టైటిల్‌ పెడితే బాలకృష్ణ అభిమానుల్ని ఆకట్టుకున్నా చాలా మంది హీరోల అభిమానులకి దూరం కావాల్సి వస్తుందని, అంతెందుకు ఇప్పుడు నందమూరి అభిమానులే రెండు వర్గాలుగా విడిపోయారు కనుక కనీసం వారి నుంచి సైతం పూర్తి మద్దతు రాదేమోనని నాని కంగారు పడుతున్నాడు.

దాదాపు అందరు హీరోల అభిమానులు అభిమానించే నాని ఇలా ఒక సినిమా కోసమని చాలా మందికి దూరం కావడానికి ఇష్టపడడం లేదట. అతడి ఆందోళనని కూడా అర్థం చేసుకున్నాక, ఈ టైటిల్‌ తమ సినిమాకి ప్లస్‌ కంటే మైనస్‌ అవుతుందని గ్రహించి పేరు మార్చాలని డిసైడ్‌ అయ్యారట. బాలయ్యకి జై కొడుతూ ఒక సినిమానే వస్తుందని చూస్తోన్న బాలయ్య అభిమానులు ఒకింత నిరాశ పడినా ఈ సినిమా బాగోగుల దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అనుకోవాలి మరి .

Tags:    
Advertisement

Similar News