బార్ లో డ్యాన్స్ " పోలీస్ స్టేషన్‌లో లైవ్
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ఇప్పుడు అక్కడి బార్ యజమానుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ముంబై నగరంలోని బార్ యజమానుల పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. ఎందుకంటే ముంబైలో ఏ బార్ కు వెళ్లినా పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టే. వినడానికి కొంత విడ్డూరంగా అనిపించినా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు అలాగే ఉన్నాయి. అసలు విషయంలోకి వద్దాం. ఇటీవల ముంబైలో డాన్స్ బార్లకు అనుమతించాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ డ్యాన్స్ […]
Advertisement
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ఇప్పుడు అక్కడి బార్ యజమానుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ముంబై నగరంలోని బార్ యజమానుల పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. ఎందుకంటే ముంబైలో ఏ బార్ కు వెళ్లినా పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టే. వినడానికి కొంత విడ్డూరంగా అనిపించినా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు అలాగే ఉన్నాయి. అసలు విషయంలోకి వద్దాం. ఇటీవల ముంబైలో డాన్స్ బార్లకు అనుమతించాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కానీ డ్యాన్స్ బార్ ల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఫడ్నవిస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అయిష్టంగానే అనుమతి ఇచ్చినా.. కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. అందులో భాగంగా లైవ్ టెలికాస్ట్ అనే నిబంధన తెరపైకి తెస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిబంధనే బార్ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. కొత్త నిబంధన అమలైతే బార్ ఏదైనా అక్కడ జరిగే డ్యాన్స్ లు అన్నీ స్థానిక పోలీస్ స్టేషన్ లో లైవ్ వెబ్ కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉంటుంది. స్టేజిపై ఎంత మంది డ్యాన్స్ చేయలన్నది కూడా బార్ ల స్థాయిని బట్టి ప్రభుత్వమే నిర్ణయించబోతోంది.
అంతేకాదండోయ్ బార్ కు వచ్చిన మందుబాబులకు, డ్యాన్సర్లకు మధ్య ఎంత దూరం ఉండాలన్నది నిబంధనల్లో చేర్చబోతున్నారు. మహారాష్ట్ర సర్కార్ తెస్తున్న ఈ కొత్త నిబంధనలతో ముంబైలో డ్యాన్స్ బార్లు పని చేయడం కష్టమేనన్న భావన కలుగుతోంది. ఈ విషయంలో బార్ల యజమానులు కూడా అసంతృప్తితో ఉన్నారు. బార్ లో జరిగే డ్యాన్సులను పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే కస్టమర్లు బార్ లకు ఎలా వస్తారని యజమానులు ప్రశ్నిస్తున్నారు. పైగా బార్ లో మందుబాబులు ఏమాత్రం తేడా చేసినా పోలీస్ స్టేషన్ గడప తట్టాల్సి వస్తుంది. ఇన్ని నిబంధనలు పెడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇక బార్ లకు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు కొనసాగిస్తోంది.
Advertisement