సాయి- రెజినా ప్రేమలో ఉన్నారా?
మెగా క్యాంప్ నుంచి సైలెంట్ గా లాంచ్ అయిన హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతల ప్రాజెక్టులతో క్షణం కూడా తీరికలేకుండా ఉన్నాడు. ఇదే సమయంలో సాయి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సాయి ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? […]
Advertisement
మెగా క్యాంప్ నుంచి సైలెంట్ గా లాంచ్ అయిన హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతల ప్రాజెక్టులతో క్షణం కూడా తీరికలేకుండా ఉన్నాడు. ఇదే సమయంలో సాయి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సాయి ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అని కొంతకాలం సినీజనాలు జుట్టు పీక్కున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు బహిరంగమైపోయింది.
రెజీనాతో డేటింగా? లవ్వా?
సాయి-రెజీనాలు కలిసి పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో వరుసగా నటించారు. ఈ రెండూ బంపర్ హిట్లుగా నిలవడంతో ఈ జంటకు హిట్ ఫెయిర్ ముద్రవేశారు ప్రేక్షకులు. కొంతకాలంగా వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్న విషయం చర్చానీయాంశంగా మారింది. రెండు చిత్రాలు కలిసి పనిచేసిన హీరో-హీరోయిన్ల మధ్య ఆ మాత్రం చనువు ఉండటం సహజమే కదా! అని మొదట్లో సినీజనాలు సరిపెట్టుకున్నారు. కానీ, సాయి నటిస్తున్న చిత్రాల షూటింగ్ స్పాట్లో రెజీనా తరచుగా ప్రత్యక్షమవుతోందని సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కు మించి ఏదో నడుస్తోందన్న గుసగుసలు మొదలయ్యాయి. కొన్ని చానళ్లు అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్లో ఉన్నారని చెబుతున్నాయి. వీటిని ఇంతవరకూ వీరిద్దరూ ఖండించకపోవడం విశేషం!
Advertisement