చెన్నైలో విషాదం- ఐసీయూలో 18 మంది మృతి
వరదలు చెన్నై నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బతీశాయి. కొద్దిరోజులుగా జనజీవనం స్తంభించిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకూ ఆటంకం ఏర్పడింది. చెన్నైలోని MIOT ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చెన్నైలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాత్రి ఈ ఘటన జరిగింది. వర్షాల కారణంగా గత మూడు రోజులుగా కరెంట్ సరఫరా ఆగిపోయింది. డిజీల్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్లు కూడా పనిచేయటంలేదు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఖాళీ అయిపోయాయి. కొత్తగా ఆక్సిజన్ […]
వరదలు చెన్నై నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బతీశాయి. కొద్దిరోజులుగా జనజీవనం స్తంభించిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకూ ఆటంకం ఏర్పడింది. చెన్నైలోని MIOT ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చెన్నైలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాత్రి ఈ ఘటన జరిగింది. వర్షాల కారణంగా గత మూడు రోజులుగా కరెంట్ సరఫరా ఆగిపోయింది. డిజీల్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్లు కూడా పనిచేయటంలేదు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఖాళీ అయిపోయాయి. కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. దీంతో ఘోరం జరిగిపోయింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.