వైసీపీ ఆఫీస్‌కు తాళం.. ఎమ్మెల్యే అరెస్ట్

కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. అద్దెచెల్లింపు విషయంలో వివాదం తలెత్తింది. కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ భవనం యజమానులు వచ్చి తాళం వేశారు. భవనం ఖాళీ చేయించేందుకు పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పోలీసులు, భవన యజమానితో వాగ్వాదానికి దిగారు. భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ కార్యాకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే […]

Advertisement
Update:2015-11-15 05:22 IST

కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. అద్దెచెల్లింపు విషయంలో వివాదం తలెత్తింది. కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ భవనం యజమానులు వచ్చి తాళం వేశారు. భవనం ఖాళీ చేయించేందుకు పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పోలీసులు, భవన యజమానితో వాగ్వాదానికి దిగారు. భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ కార్యాకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ప్రభుత్వం, పోలీసులు కలిసి కక్షపూరితంగానే వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొడాలి నాని టీడీపీలో ఉన్న కాలంలోనూ ఇదే భవనాన్ని కార్యాలయంగా వాడారని గుర్తు చేస్తున్నారు. గుడివాడలో నానిని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని మండిపడుతున్నారు. అసలు సివిల్ కేసులో పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News