దేవదాసుతో బాజీరావ్ కనెక్షన్..?
త్వరలోనే గ్రాండ్ గా విడుదలకాబోతోంది బాజీరావు మస్తానీ సినిమా. బాజీరావ్ అనే వీరుడి చారిత్రక గాథను వెండితెరపై ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అయితే ఈ సినిమాకు దేవదాసుతో కనెక్షన్ ఉందని అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. అప్పటి దేవదాసు మేనియా నుంచి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇంకా బయటపడలేదని వాదిస్తున్నారు. దేవదాసు సినిమాలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ ఇద్దరూ డాన్స్ చేస్తారు. ఆ పాట అప్పట్లో సూపర్ హిట్టయింది కూడా. కానీ ఒరిజినల్ దేవదాసు నవలలో […]
Advertisement
త్వరలోనే గ్రాండ్ గా విడుదలకాబోతోంది బాజీరావు మస్తానీ సినిమా. బాజీరావ్ అనే వీరుడి చారిత్రక గాథను వెండితెరపై ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అయితే ఈ సినిమాకు దేవదాసుతో కనెక్షన్ ఉందని అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. అప్పటి దేవదాసు మేనియా నుంచి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇంకా బయటపడలేదని వాదిస్తున్నారు. దేవదాసు సినిమాలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ ఇద్దరూ డాన్స్ చేస్తారు. ఆ పాట అప్పట్లో సూపర్ హిట్టయింది కూడా. కానీ ఒరిజినల్ దేవదాసు నవలలో అలాంటి సన్నివేశమే లేదు. అది భన్సాలీ సృష్టి. తాజాగా తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీలో కూడా ప్రియాంకాచోప్రా, దీపికా పదుకోన్ మధ్య అలాంటి సాంగ్ ఒకటి పెట్టాడు భన్సాలీ. కానీ చరిత్ర చూసుకుంటే.. బాజీరావ్ భార్య, ప్రియురాలు కలుసుకున్న సందర్భాలే లేవు. కేవలం దేవదాసులో సాంగ్ హిట్టయింది కాబట్టే.. బాజీరావ్ మూవీలో కూడా పెట్టాడని విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలకు భన్సాలీ ఎలా స్పందిస్తాడో చూడాలి. సినిమా అన్న తర్వాత ఆ మాత్రం స్వేచ్ఛ తీసుకోవడంలో తప్పులేదంటాడేమో..
Advertisement