రాకెట్ లా దూసుకుపోతున్న రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ రాకెట్ లా దూసుకుపోతున్నాడు. సుకుమార్ అండదండలతో కుమారి 21-ఎఫ్ అనే సినిమాను సిద్ధంచేశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు త్వరలోనే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా నటించనున్నాడు రాజ్ తరుణ్. ఈ సారి ఓ యూత్ ఫుల్ కథను రాజ్ తరుణ్ కోసం ఎంచుకున్నాడట వర్మ. ఈ రెండు సినిమాలు కాకుండా.. సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలతో […]
Advertisement
రాజ్ తరుణ్ రాకెట్ లా దూసుకుపోతున్నాడు. సుకుమార్ అండదండలతో కుమారి 21-ఎఫ్ అనే సినిమాను సిద్ధంచేశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు త్వరలోనే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా నటించనున్నాడు రాజ్ తరుణ్. ఈ సారి ఓ యూత్ ఫుల్ కథను రాజ్ తరుణ్ కోసం ఎంచుకున్నాడట వర్మ. ఈ రెండు సినిమాలు కాకుండా.. సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలతో పాటు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు.
త్వరలోనే తన సొంత బ్యానర్ పై ఓ పంజాబీ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు మంచు విష్ణు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రీమేక్ కానున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో ఓ హీరోగా తను నటిస్తాడు. మరో హీరో పాత్రను రాజ్ తరుణ్ కు ఆఫర్ చేశాడు విష్ణు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట రాజ్ తరుణ్. త్వరలోనే ఈ మల్టీస్టారర్ మూవీపై ఓ క్లారిటీ వస్తుంది.
Advertisement