ఆలీకి రానా వార్నింగ్
అనుష్క గురించి కమేడియన్ అలీ చేసిన కామెంట్లు మహిళా లోకాన్నే కాదు. హీరోలకు కూడా కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇటీవల సైజ్ జోరో ఆడియో వేడుకలో హీరోయిన్ అనుష్కపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో హీరో రానా అక్కడే ఉన్నాడంట. అందరి ముందు అంటే బాగుండదని ప్రోగ్రాం అయ్యాక ఆలీకి ఫోన్ చేసి ఏంటా మాటలు అంటూ వార్నింగ్ ఇచ్చాడంట. వెంటనే తన తప్పు తెలుసుకున్న ఆలీ అనుష్కకి ఫోన్ చేసి సారీ చెప్పాడంట. ఇటీవల […]
Advertisement
అనుష్క గురించి కమేడియన్ అలీ చేసిన కామెంట్లు మహిళా లోకాన్నే కాదు. హీరోలకు కూడా కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇటీవల సైజ్ జోరో ఆడియో వేడుకలో హీరోయిన్ అనుష్కపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో హీరో రానా అక్కడే ఉన్నాడంట. అందరి ముందు అంటే బాగుండదని ప్రోగ్రాం అయ్యాక ఆలీకి ఫోన్ చేసి ఏంటా మాటలు అంటూ వార్నింగ్ ఇచ్చాడంట. వెంటనే తన తప్పు తెలుసుకున్న ఆలీ అనుష్కకి ఫోన్ చేసి సారీ చెప్పాడంట. ఇటీవల యాంకర్ సుమ, హీరోయిన్ సమంతలపైనా ఇలాగే నోరు పారేసుకున్న ఆలీ వారికి కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇటీవల లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా ఆడియో ఫంక్షన్‌లోనూ అనవసరంగా తనపై కామెంట్లు చేసినందుకు గాయని గీతామాధురి అలీకి స్టేజిపై వార్నింగ్ ఇచ్చింది. ఇది జరిగిన నాలుగురోజులకే సైజ్ జీరో ఆడియో ఫంక్షన్‌లో అనుష్క విషయంలో మాట జారిపోయాడు ఆలీ. కొంతకాలంగా ఆలీ యాంకర్లపై, హీరోయిన్లపై వేస్తున్న కుళ్లు జోకులకు మహిళ సంఘాలే కాదు. ఇండస్ర్టీలోని ప్రముఖులు సైతం గట్టిగానే వార్నింగులు ఇస్తున్నారు. అయినా ఆలీ తీరు మారకపోవడం దురదృష్టకరం.
Advertisement