జూనియర్.. కొరటాల మధ్య కారాలు మిరియాలు..?
శ్రీమంతుడు సినిమాతో మంచి ఊపుమీదున్న కొరటాల శివ దర్శకత్వంలో దసరా పండక్కి కొత్తసినిమాకు కొబ్బరికాయ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో గానీ… దర్శకుడు శివకు, బుడ్డ ఎన్టీఆర్‌కు చాలా విషయాల్లో విభేదాలు వస్తున్నాయట. 15 ఏళ్లుగా మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి నటవారసుడి సూచనలను శివ అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. స్క్రిప్టు, నటుల విషయంలో జూనియర్ మాటలను శివ లెక్క […]
Advertisement
శ్రీమంతుడు సినిమాతో మంచి ఊపుమీదున్న కొరటాల శివ దర్శకత్వంలో దసరా పండక్కి కొత్తసినిమాకు కొబ్బరికాయ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టారో గానీ… దర్శకుడు శివకు, బుడ్డ ఎన్టీఆర్‌కు చాలా విషయాల్లో విభేదాలు వస్తున్నాయట. 15 ఏళ్లుగా మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి నటవారసుడి సూచనలను శివ అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. స్క్రిప్టు, నటుల విషయంలో జూనియర్ మాటలను శివ లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు తన తండ్రి నందమూరి హరికృష్ణను తీసుకోవాలని కోరినపుడు శివ సున్నితంగా తిరస్కరించాడట. ఈ పాత్రకు మోహన్‌లాల్ అయితేనే సరిగ్గా సరిపోతాడని, పైగా మార్కెట్పరంగా ఇది సినిమాకు ఎంతో దోహదపడుతుందని శివ చెప్పుకొచ్చాడట. ఇక హీరోయిన్ విషయంలోనూ శివ తన మాటే నెగ్గించుకున్నాడని సమాచారం. కథనాయికగా శ్రుతిహాసన్ని తీసుకోవాలన్న జూనియర్ రిక్వెస్టును శివ పట్టించుకోలేదట. ఆల్రెడీ శ్రుతితో సినిమా చేశాను. కాబట్టి, ఈసారి బాలీవుడ్ నుంచి పరిణితీ చోప్రాను దిగుమతి చేసేస్తానని కుండబద్దలు కొట్టాడట. అసలే హిట్లు లేక సతమతమవుతున్న జూనియర్ శివ చెప్పినట్లు చేయడం మినహా మరేం చేయలేకపోతున్నాడట. పాపం బుడ్డోడు! సరే ఏది చేసినా హిట్టు కోసమే కదా!
Advertisement