హాస్యనటుడు కొండవలస కన్నుమూత

హాస్య ప్రధాన పాత్రలో సినిమా ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) సోమవారం కన్ను మూశారు. కొండవలస స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఆయన 1946 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 2002లో ఆయనకు దర్శకుడు వంశీ ‘ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు’ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అదే ఆయన తొలి సినిమా. కబడ్డీ, కబడ్డీ, రాధాగోపాలం, ఎవడిగోల వాడిదే, సైనికుడు, రాఖీ, అత్తిలి సత్తిబాబు, అదుర్స్‌ చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఆయనకు తొలి […]

Advertisement
Update:2015-11-02 17:50 IST

హాస్య ప్రధాన పాత్రలో సినిమా ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) సోమవారం కన్ను మూశారు. కొండవలస స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఆయన 1946 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 2002లో ఆయనకు దర్శకుడు వంశీ ‘ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు’ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అదే ఆయన తొలి సినిమా. కబడ్డీ, కబడ్డీ, రాధాగోపాలం, ఎవడిగోల వాడిదే, సైనికుడు, రాఖీ, అత్తిలి సత్తిబాబు, అదుర్స్‌ చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఆయనకు తొలి సినిమాలోనే మంచి పేరు వచ్చింది. అందులోనే ఆయన ‘అయితే ఓకే’ అనే మాటతో అందరికీ సుపరిచితులయ్యారు. ఆ మాటే తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సోమవారం నిమ్స్‌కు తరలిస్తుండగా ఆయన మార్గమధ్యలోనే కన్నుమూశారు. 300 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన కొండవలస ఎక్కువగా హాస్యపాత్రల్లో బాగా రాణించారు. సినీ రంగ ప్రవేశానికి ముందు ఆయన వేయికి నాటకాల్లో బహుముఖ పాత్రలు పోషించారు. 2014లో నిర్మించిన ‘శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర’ కొండవలసకు తన చివరి సినిమాగా మిగిలిపోయింది. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్ట్‌లో ఉద్యోగం చేశారు. కొండవలస మృతి పట్ల సినీరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమ ఎంతో మంది హాస్యనటులను కోల్పోయింది. ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, మాడా లాంటి హాస్యనటులను కోల్పోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు కొండవలసను కోల్పోయింది. కొండవలస మృతి చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.

Tags:    
Advertisement

Similar News