రెండు రోజుల్లో భారత్ కు చోటా రాజన్

అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ భారత్ వచ్చేందుకు మార్గం సుగమం అయింది. వారం రోజుల క్రితం ఇండోనేషియాలోని బాలీ ఎయిర్ పోర్టులో అరెస్టయిన చోటా రాజన్ ను అక్కడి పోలీసులతోపాటు భారత దౌత్య అధికారులు, సీబీఐ బృందం విచారించింది. చోటా రాజన్ పై నమోదైన వివిధ కేసులను బాలీ పోలీసులకు వివరించిన సీబీఐ అధికారులు రాజన్ ను భారత్ రప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బాలీలోని డిటెన్షన్ సెంటర్ లో వున్న రాజన్ ను రెండు […]

Advertisement
Update:2015-11-02 15:18 IST

అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ భారత్ వచ్చేందుకు మార్గం సుగమం అయింది. వారం రోజుల క్రితం ఇండోనేషియాలోని బాలీ ఎయిర్ పోర్టులో అరెస్టయిన చోటా రాజన్ ను అక్కడి పోలీసులతోపాటు భారత దౌత్య అధికారులు, సీబీఐ బృందం విచారించింది. చోటా రాజన్ పై నమోదైన వివిధ కేసులను బాలీ పోలీసులకు వివరించిన సీబీఐ అధికారులు రాజన్ ను భారత్ రప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం బాలీలోని డిటెన్షన్ సెంటర్ లో వున్న రాజన్ ను రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై ఢిల్లీ, ముంబైకి చెందిన సీబీఐ సభ్యుల బృందం ఇండోనేషియా పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. చోటా రాజన్ పై హత్యలు, మాదకద్రవ్యాల దొంగరవాణాతో సహా 70కి పైగా కేసులున్నాయి. 1995లో ఇంటర్ పోల్ నోటీసులు ఇవ్వడంతో చోటా రాజన్ అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యాడు.
2 దశాబ్దాలుగా వివిధ దేశాల్లో తిరుగుతూ, అజ్ఞాతంలో ఉంటూ వస్తున్న రాజన్ అక్టోబర్ 25న ఆస్ట్రేలియా నుంచి వస్తూ బాలి ఎయిర్ పోర్టులో ఇండోనేషియా పోలీసులకు చిక్కాడు. చోటా రాజన్ ఇండియాకు వస్తే మరో మాఫియా డాన్ అయి దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News