కీచకలో 8 నిమిషాలకో రేప్
కీచక సినిమా విడుదలకు ముందే వివాదస్పదంగా మారింది. ఈ సినిమాలో మహిళల స్థాయిని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని బుధవారం ఫిలించాంబర్ వద్ద చిత్ర దర్శకుడు ఎస్‌వీబీ చౌదరిపై మహిళా సంఘాల నాయకురాళ్లు దాడి చేశారు. సినిమా మొత్తం రేప్‌లతో నింపేశారని ఆరోపించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని వారు మండిపడుతున్నారు. నాగ్‌పూర్‌లో 300 మంది మహిళలను రేప్ చేసిన ఓ మానవ మృగం జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. తెలుగు సినిమాలో […]
Advertisement
కీచక సినిమా విడుదలకు ముందే వివాదస్పదంగా మారింది. ఈ సినిమాలో మహిళల స్థాయిని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని బుధవారం ఫిలించాంబర్ వద్ద చిత్ర దర్శకుడు ఎస్‌వీబీ చౌదరిపై మహిళా సంఘాల నాయకురాళ్లు దాడి చేశారు. సినిమా మొత్తం రేప్‌లతో నింపేశారని ఆరోపించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని వారు మండిపడుతున్నారు. నాగ్‌పూర్‌లో 300 మంది మహిళలను రేప్ చేసిన ఓ మానవ మృగం జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. తెలుగు సినిమాలో రేప్ సన్నివేశాలు కనుమరుగై దశాబ్దంన్నర దాటింది. అలాంటి సన్నివేశాలను మళ్లీ తెరపై చూడాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చిందని సినీ ప్రముఖులు సైతం ప్రశ్నిస్తున్నారు.
అందుకే సినిమా తీశారా?
ఢిల్లీలో నిర్భయ ఘటన తరువాత దేశంలో మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా వెలుగుచూస్తోన్న అత్యాచారాల ప్రభావం దేశ పర్యాటక రంగంపైనా పడింది. కీచక సినిమాను లైంగికదాడులు, హింస, హత్యలతో నింపారని మహిళా సంఘాలు ఆరోపిస్తుండగా.. ఇది ఓ మంచి సందేశాత్మక చిత్రం అని కీచక యూనిట్ సమర్థించుకుంటుంది. ఇప్పటికే దేశంలోని పలు పోర్న్ సైట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు కొరడాలు ఝుళిపిస్తుంటే.. ఈ సినిమా విడుదలకు అనుమతి ఎలా మంజూరు చేస్తారన్న మహిళల వాదనను పలువురు సమర్థిస్తున్నారు. ఇలాంటి సినిమాలు పసి మనసుల్లో విషాన్ని నాటుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమాలో ఏకంగా 15 రేప్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. రెండుగంటల నిడివిగల సినిమాలో సగటున ప్రతి 8 నిమిషాలకు ఓ భయంకరమైన, క్రూరమైన రేప్ సన్నివేశం వస్తుందన్నమాట. ఒకటో రెండో అంటే సరే గానీ, ఏకంగా 15 రేప్‌లంటే.. దర్శకుడికి అన్ని సీన్లు తీయడానికి చేతులెలా వచ్చాయని మహిళలు మండిపడుతున్నారు. అసలు ఈ సినిమా సందేశం కోసం తీసినట్లుగా లేదని.. ఎలా రేప్ చేయాలో నేర్పడానికే తీసినట్లు ఉందని ఆరోపిస్తున్నారు.
Advertisement