అధికారులపై దాడులు చేస్తాం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. తాము తలుచుకుంటే గ్రామ పొలిమేరలు దాటి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన  గౌడ సమ్మెళనంలో ప్రసంగించిన శ్రీనివాసగౌడ్ కల్లుపై కల్తీ ముద్ర వేసి గీత వృత్తిని దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్‌ గౌడ్ ఏమన్నారంటే..”ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లవద్దని కేసీఆరే చీప్‌ లిక్కర్‌ వెనక్కు తీసుకుంటే కొందరు అధికారులు చెబుతారు. లేదులేదు గౌడ్లు వ్యతిరేకంచారని. అందుకే […]

Advertisement
Update:2015-10-28 02:17 IST

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. తాము తలుచుకుంటే గ్రామ పొలిమేరలు దాటి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన గౌడ సమ్మెళనంలో ప్రసంగించిన శ్రీనివాసగౌడ్ కల్లుపై కల్తీ ముద్ర వేసి గీత వృత్తిని దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీనివాస్‌ గౌడ్ ఏమన్నారంటే..”ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లవద్దని కేసీఆరే చీప్‌ లిక్కర్‌ వెనక్కు తీసుకుంటే కొందరు అధికారులు చెబుతారు. లేదులేదు గౌడ్లు వ్యతిరేకంచారని. అందుకే కల్లు మీద దాడి చేస్తామంటున్నారు. బిడ్డా… మీ మీదే దాడి చేస్తాం. మేం అనుకుంటే ఏ ఊరులో కూడా పొలిమేరలూ దాటిపోలేరు. ఏ దుకాణంలోనైనా చూడు 70 ఏళ్ల ముసలోడు తాగుతా ఉంటాడు. ఎంక్వైరీ చేయి ఎప్పటి నుంచి తాగుతున్నావని.. చినప్పటి నుంచి తాగుతుంటడు. చినప్పటి నుంచి తాగుతుంటే కల్తీ అయితే ఎట్ల బతుకుతడు రా… ఒకసారి ఆలోచన చేయ్” అని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అక్రమ సంపాదనతో కొందరు అధికారులు బెంగుళూరు, గుర్గావ్‌ వంటి ప్రాంతాల్లో ఫాంహౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. వారంతా ఇప్పుడు దొంగల్లా తమ ప్రభుత్వంలోకి చొరబడ్డారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. డిస్టిలరీలు, లిక్కర్‌ మాఫియాతో అధికారులు కుమ్మక్కై గీత వృత్తిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పోస్ట్‌మార్టం నివేదికల్లో ఎక్కడయినా కల్తీ కారణంగా చనిపోయినట్లు రిపోర్టు వచ్చిందా అని నిలదీశారు. అధికారులారా! ఖబర్దార్‌ అని హెచ్చరించారు. పేపర్‌లో రాస్తే బయపడుతామనుకున్నావా… బిడ్డా ప్రాణాకైనా భయపడం రా..” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము తప్పు చేస్తే సీఎం కేసీఆర్‌ ఇంటి వద్దకు వెళ్లి కత్తితో పొడుచుకుని చచ్చిపోతామే తప్ప పార్టీకి చెడ్డపేరు తీసుకురామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News