కాల్చిపారేయండి.. కేసులుండవు: మంత్రి
కాల్చిపారేయండి.. కేసులు ఉండవు.. నష్టం కలిగిస్తే.. ఊరుకునేది లేదని అటవీ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. బాధ్యత గల మంత్రి అయి ఉండి.. కాల్చిపారేయండని చెప్పడమేంటని కంగారు పడుతున్నారా?.. ఆయన చంపమన్నది మనుషులను కాదు అడవిపందులను! తెలంగాణ జిల్లాల్లో.. చేతికందిన పంటలను అడవిపందులు రాత్రిపూట దాడి చేసి నాశనం చేస్తున్నాయి. వాటిని ఏమన్నా చేద్దామంటే.. అటవీ చట్టాల కేసుల భయంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. […]
Advertisement
కాల్చిపారేయండి.. కేసులు ఉండవు.. నష్టం కలిగిస్తే.. ఊరుకునేది లేదని అటవీ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. బాధ్యత గల మంత్రి అయి ఉండి.. కాల్చిపారేయండని చెప్పడమేంటని కంగారు పడుతున్నారా?.. ఆయన చంపమన్నది మనుషులను కాదు అడవిపందులను! తెలంగాణ జిల్లాల్లో.. చేతికందిన పంటలను అడవిపందులు రాత్రిపూట దాడి చేసి నాశనం చేస్తున్నాయి. వాటిని ఏమన్నా చేద్దామంటే.. అటవీ చట్టాల కేసుల భయంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.
ఈ విషయంపై సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పరేశ్‌కుమార్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. రైతుల పంటలను కాపాడేందుకు అడవి పందులను కాల్చివేసేందుకు అటవీశాఖ అధికారులకు అధికారాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. వాటిని కాలిస్తే.. ఎలాంటి కేసులు పెట్టకూడదని కూడా అధికారులను ఆదేశించారు. కోతుల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు రూ.55 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
Advertisement