అమ్మ కందిపప్పు రూ.110
తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు డబుల్ సెంచరీ కొట్టాయి. కొనలేక సామాన్యుల నుంచి మధ్య తరగతి వారి వరకు అవస్థలు పడుతున్నారు. అయినా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ధరలను అదుపు చేయడంలో విఫలం అవుతున్నాయి. కానీ తమిళనాడు సీఎం జయలలిత మాత్రం ఆరాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆకాశానికి ఎగబాకిన కందిపప్పు ధరలనుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో 110 రూపాయలకే విక్రయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మహారాష్ట్ర […]
తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు ధరలు డబుల్ సెంచరీ కొట్టాయి. కొనలేక సామాన్యుల నుంచి మధ్య తరగతి వారి వరకు అవస్థలు పడుతున్నారు. అయినా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ధరలను అదుపు చేయడంలో విఫలం అవుతున్నాయి. కానీ తమిళనాడు సీఎం జయలలిత మాత్రం ఆరాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆకాశానికి ఎగబాకిన కందిపప్పు ధరలనుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో 110 రూపాయలకే విక్రయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కిలో 200 పైన పలుకుతున్న కందిపప్పును 150కి అందిస్తోంది.
ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2కిలోల కందిపప్పు మాత్రమే ఇస్తారు. కందిపప్పు ధరను అదుపు చేసేందుకు కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడిన జయలలిత 500 టన్నుల పప్పును రాష్ట్రానికి రప్పించింది. ఈ పప్పును ప్యాకెట్లు గా చేసి కేజీ పప్పును రూ.110 చొప్పున విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని జయలలిత ఆదేశించింది. తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పరిధిలోని 20 అముదం షాపులు, 71 కో ఆపరేటివ్ షాప్స్ లో వచ్చే నెల ఒకటి కందిపప్పు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అందించే కంది పప్పు కొనుక్కోవాలనుకుంటే ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.