రివ్యూవర్స్‌కి క్రిష్ సూటి ప్రశ్న

కొన్ని సినిమాలు రివ్యూస్‌తో సంబంధం లేకుండా, అంచనాలతో పని లేకుండా తమకంటూ ఒక స్థానం సంపాదించుకుంటాయి.అటువంటి సినిమాలలో ‘కంచె ‘ కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. కొంత మంది ఇది ఇన్‌టలెక్చువల్స్ సినిమా అని.. కామన్ ఆడియెన్స్‌కి అర్థం అవ్వకపోవచ్చని అభిప్రాయపడడం చూస్తున్నాం. కాని ‘సాధారణ ఆడియెన్స్ కి నచ్చదు అనేవారు.. తాము అసాధారణ ఆడియెన్స్ అని అనుకుంటున్నారా? అని క్రిష్ సూటి ప్రశ్న వేసారు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. కాని రివ్యూస్ కి […]

Advertisement
Update:2015-10-24 00:37 IST

కొన్ని సినిమాలు రివ్యూస్‌తో సంబంధం లేకుండా, అంచనాలతో పని లేకుండా తమకంటూ ఒక స్థానం సంపాదించుకుంటాయి.అటువంటి సినిమాలలో ‘కంచె ‘ కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. కొంత మంది ఇది ఇన్‌టలెక్చువల్స్ సినిమా అని.. కామన్ ఆడియెన్స్‌కి అర్థం అవ్వకపోవచ్చని అభిప్రాయపడడం చూస్తున్నాం. కాని ‘సాధారణ ఆడియెన్స్ కి నచ్చదు అనేవారు.. తాము అసాధారణ ఆడియెన్స్ అని అనుకుంటున్నారా? అని క్రిష్ సూటి ప్రశ్న వేసారు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.
కాని రివ్యూస్ కి భిన్నంగా .. క్రిష్ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ బాగుందనే చెప్పాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుంటే ఆడియెన్స్ చూడరు.. అనే దృక్పథంతో కాకుండా .. తెలుగు ఆడియెన్స్ లెవెల్ పెంచే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి అని కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫక్తు ఫార్ములా ..కమర్షియల్ సినిమాలు ఆడని ఈ పండుగ సీజన్‌లో ‘క్లాస్ ‘ సినిమా అని బ్రాండ్ వేసిన సినిమా ఆడడం చూస్తుంటే.. క్రిష్ సూటి ప్రశ్న కరక్టే అనిపిస్తుంది కదా!

Tags:    
Advertisement

Similar News