ఎల్‌ఈడీ బల్బులతో రూ. 1000 కోట్లు ఆదా

దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సబ్సిడీతో పంపిణీ చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోది ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం వల్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం ప్రకటించింది. గృహ వినియోగదారులకు ఇవి అందించడం ద్వారా రోజుకు 73 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంటే రోజుకు రూ.2.9 కోట్ల విద్యుత్ వినియోగం ఖర్చు తగ్గుతుందన్న మాట. 2018 సంవత్సరం నాటికి 77 కోట్ల బల్బులు సబ్సిడీ […]

Advertisement
Update:2015-10-23 18:11 IST

దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సబ్సిడీతో పంపిణీ చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోది ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం వల్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం ప్రకటించింది. గృహ వినియోగదారులకు ఇవి అందించడం ద్వారా రోజుకు 73 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంటే రోజుకు రూ.2.9 కోట్ల విద్యుత్ వినియోగం ఖర్చు తగ్గుతుందన్న మాట. 2018 సంవత్సరం నాటికి 77 కోట్ల బల్బులు సబ్సిడీ ద్వారా గృహ వినియోగదారులకు ఎఈడీ బల్బులు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
కొన్ని రాష్ర్టాల్లో బల్బుల పంపిణీ వేగవంతంగా జరుగుతున్నా, మరికొన్ని రాష్ర్టాల్లో మందకొడిగా ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 65 లక్షల బల్బులు, ఢిల్లీ ప్రభుత్వం 34 లక్షల బల్బులు పంపిణీ చేశాయని పేర్కొన్నారు. 18.6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసి ఏపీలోని గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. బల్బు ధర మార్కెట్‌లో రూ.310 ఉండగా దాన్ని కేంద్రం సబ్సిడీపై రూ.73కు అందిస్తుందని తెలిపారు. కేంద్రం ఇప్పటికే పలు కంపెనీలకు 10 కోట్ల బల్బులు ఆర్డర్ చేసిందని, అవి అందుబాటులోకి రాగానే విడతల వారిగా మిగిలిన రాష్ర్టాల్లో పంపిణీ చేయనుందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News