పోలీసులను పట్టిస్తే.. పాతికవేలు!
ఇదేంటి శీర్షికలో అచ్చుతప్పులు ఉన్నాయనుకుంటున్నారా? మీకు సరిగ్గానే చదివారు. అవినీతి పోలీసుల అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చిన పౌరులకు రూ.25వేలు బహుమానం ప్రకటించారు డిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ. నేరుగా పట్టించే సాహసం చేయలేని వారు పోలీసుల అవినీతిని రుజువు చేసే వీడియోలు పంపించినా రూ.10 వేలు గెలుచుకోవచ్చని వెల్లడించారు. పోలీసు బాస్ అయి ఉండి ఇలాంటి ప్రకటన చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందంటే..? ఇటీవల సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో […]
Advertisement
ఇదేంటి శీర్షికలో అచ్చుతప్పులు ఉన్నాయనుకుంటున్నారా? మీకు సరిగ్గానే చదివారు. అవినీతి పోలీసుల అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చిన పౌరులకు రూ.25వేలు బహుమానం ప్రకటించారు డిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ. నేరుగా పట్టించే సాహసం చేయలేని వారు పోలీసుల అవినీతిని రుజువు చేసే వీడియోలు పంపించినా రూ.10 వేలు గెలుచుకోవచ్చని వెల్లడించారు. పోలీసు బాస్ అయి ఉండి ఇలాంటి ప్రకటన చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందంటే..? ఇటీవల సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశ రాజధానిలో అత్యంత అవినీతి ప్రభుత్వ శాఖ ఢిల్లీ పోలీసు దళమని తేలింది. తమపై వచ్చిన ఆరోపణలను బస్సీ వెంటనే ఖండించలేదు..అయినా ఎలాంటి అవినీతిని సహించేది లేదని.. ఎక్కడైనా అలాంటి చర్యలు పౌరుల దృష్టికి వస్తే.. 9910641064 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియపరచాలని కోరారు. అవినీతి పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు గతేడాది 1064 అనే హెల్ప్‌లైన్ నెంబరును సైతం నెలకొల్పామని గుర్తు చేశారు. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసు శాఖను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు విభాగాన్ని తమకు అప్పగిస్తే..ఏడాదిలో ప్రక్షాళన చేసి చూపెడతామని సవాలు విసిరారు.
Advertisement