చరణ్‌కి మతిమరుపు వచ్చిందా?

ఒకోసారి కొన్ని విషయాలు అసలు అర్థం కావు. అదేమిటీ మనమే పొరబడ్డామా? అని అనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్ పోయాక అర్థం అవుతుంది.. తిమ్మిని బమ్మి చేసి మాట్లాడితే అలాగ కలిగిన కన్‌ఫ్యూజన్ అది అని. రామ్ చరణ్ విషయంలో ఇప్పుడదే జరిగింది. ఇటీవల చరణ్ ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్స్ బ్రాండ్ అంబాసడర్ గా బిజినెస్ లోకి ఎంటర్ అయిన విషయం మనకు తెలిసినదే. ఇటీవలే ఆ ఎయిర్‌లైన్స్ తన సేవలు మొదలుపెట్టింది కూడా. కాని కస్టమర్ సర్వీసెస్ అధ్వాన్నంగా […]

Advertisement
Update:2015-10-16 13:26 IST

ఒకోసారి కొన్ని విషయాలు అసలు అర్థం కావు. అదేమిటీ మనమే పొరబడ్డామా? అని అనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్ పోయాక అర్థం అవుతుంది.. తిమ్మిని బమ్మి చేసి మాట్లాడితే అలాగ కలిగిన కన్‌ఫ్యూజన్ అది అని. రామ్ చరణ్ విషయంలో ఇప్పుడదే జరిగింది. ఇటీవల చరణ్ ట్రూజెట్ అనే ఎయిర్‌లైన్స్ బ్రాండ్ అంబాసడర్ గా బిజినెస్ లోకి ఎంటర్ అయిన విషయం మనకు తెలిసినదే. ఇటీవలే ఆ ఎయిర్‌లైన్స్ తన సేవలు మొదలుపెట్టింది కూడా. కాని కస్టమర్ సర్వీసెస్ అధ్వాన్నంగా ఉన్నాయనే టాక్ బయలుదేరింది.
దానికి చరణ్‌కి కోపం వస్తోంది. నేను ఆ సంస్ఠకు బ్రాండ్ అంబాసిడర్‌ని మాత్రమే. ఆ ఎయిర్‌లైన్స్ సేవలు సరిగ్గా లేకపోతే నన్ను భాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా సమాధానాలు ఇస్తున్నాడు మన మెగాహీరో. అందరూ తన గురించే మాట్లాడడం సరికాదని హితవు చెబుతున్నాడు. మరి చరణ్ కూడా ట్రూజెట్‌లో ఇన్‌వెస్ట్ చేసాడని కదా ప్రచారం జరిగింది. ఆ ఎయిర్‌లైన్స్‌లో 26% వాటా కలిగిన మదుపరి చెర్రి. కేవలం 21% వాటా ఉన్న ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్‌కి కూడా రామ్ చరణ్ బ్యాకింగ్ ఉందని అందరికీ తెలిసిందే. మరిప్పుడు ఆ ఎయిర్ లైన్స్ సేవలు బాగోలేక పోతే చరణ్ జవాబుదారీ కాదా?

Tags:    
Advertisement

Similar News