జైలులో థర్డ్‌జెండర్స్‌కు ప్రత్యేక బ్లాకులు

మేల్‌, ఫిమేల్‌, థర్డ్‌జెండర్‌ ఈ మూడువర్గాలకు సమానహక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. దీంతో అన్నిచోట్లా థర్డ్‌జెండర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు సాగుతున్నాయి. చివరికి జైలులో కూడా థర్డ్‌జెండర్‌ వాళ్లకు ప్రత్యేక బ్లాకులు నిర్మిస్తున్నారు. కేరళలో కొత్తగా నిర్మిస్తున్న ఆరుజైళ్లలోనూ థర్డ్‌జెండర్‌ వాళ్లకు ప్రత్యేక బ్లాకులు ఉంటాయని జైళ్ల శాఖ డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా వెల్లడించారు. పురుషులు, స్ర్తీల కంటే థర్డ్‌ జెండర్‌ అవసరాలు చాలా భిన్నమైనవని, అందుకే వారి కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు, […]

Advertisement
Update:2015-10-13 09:11 IST

మేల్‌, ఫిమేల్‌, థర్డ్‌జెండర్‌ ఈ మూడువర్గాలకు సమానహక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. దీంతో అన్నిచోట్లా థర్డ్‌జెండర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు సాగుతున్నాయి. చివరికి జైలులో కూడా థర్డ్‌జెండర్‌ వాళ్లకు ప్రత్యేక బ్లాకులు నిర్మిస్తున్నారు. కేరళలో కొత్తగా నిర్మిస్తున్న ఆరుజైళ్లలోనూ థర్డ్‌జెండర్‌ వాళ్లకు ప్రత్యేక బ్లాకులు ఉంటాయని జైళ్ల శాఖ డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా వెల్లడించారు. పురుషులు, స్ర్తీల కంటే థర్డ్‌ జెండర్‌ అవసరాలు చాలా భిన్నమైనవని, అందుకే వారి కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లతో బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విదేశాల్లో పర్యటించిన జైళ్లశాఖ ఉన్నతాధికారుల బృందం అక్కడ..థర్డ్‌జెండర్‌ ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో చూసి వచ్చిందని, వారి సూచనల మేరకు ప్రత్యేక బ్లాకుల నిర్మాణం ఉంటుందని చెప్పారు. లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్స్‌ (ఎల్జీబీటీ) కమ్యూనిటీని థర్డ్‌జెండర్‌గా వ్యవహరిస్తారు. కోర్టు ఆదేశాలతోపాటు జైళ్ల నిబంధనల ప్రకారం థర్డ్‌జెండర్‌ ఖైదీల స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేరళ జైళ్లశాఖ డీజీపీ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News