చిరంజీవి నో.. మహేష్.. ఎస్ అంటున్న తేజ‌

ఈ మధ్య డైరెక్టర్ తేజ తన సినిమాలకన్నా, తన కాన్‌ట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా ఎక్కువగా వార్తలలో నానుతున్నాడు. కొంతమందికి తేజ అంటే కాంట్రవర్సీ కింగ్ అనే భావన కలుగుతోంది ఇటీవల అతను చేసిన ఇస్తున్న కామెంట్స్ వలన. అదే పంథా కొనసాగిస్తూ, తేజ మరోసారి తెలుగు సినిమా బిగ్ స్టార్స్ పైన మరికొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసాడు. తాను ఎప్పటికీ చిరంజీవితో సినిమా చేయలేను అని తేల్చి చెప్పాడు…కారణం సింపిల్.. అసలు చిరంజీవి తనను తన 150వ […]

Advertisement
Update:2015-10-08 00:33 IST

ఈ మధ్య డైరెక్టర్ తేజ తన సినిమాలకన్నా, తన కాన్‌ట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా ఎక్కువగా వార్తలలో నానుతున్నాడు. కొంతమందికి తేజ అంటే కాంట్రవర్సీ కింగ్ అనే భావన కలుగుతోంది ఇటీవల అతను చేసిన ఇస్తున్న కామెంట్స్ వలన. అదే పంథా కొనసాగిస్తూ, తేజ మరోసారి తెలుగు సినిమా బిగ్ స్టార్స్ పైన మరికొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసాడు. తాను ఎప్పటికీ చిరంజీవితో సినిమా చేయలేను అని తేల్చి చెప్పాడు…కారణం సింపిల్.. అసలు చిరంజీవి తనను తన 150వ సినిమా చేయమని అడిగినా తాను చేయలేనని చెప్పేసాడు.
చిరంజీవి లాంటి స్టార్స్ ఒక ‘ఫ్రేంవర్క్’ లో ఇమిడి పోయారు. వారితో వర్క్ చేయడం ఒక రొటీన్‌లా ఉంటుంది. కొన్ని సాంగ్స్, కొన్ని ఫైట్స్, కొంత కామెడీ వంటి రొటీన్ ఫార్ములా.. మూస ఫార్ములాకి వారు అలవాటు అయిపోయారు. సో.. అన్ని ఆ ఫార్ములాకి ఇరికించాలి..లేదా ఒక రీమేక్ చెయాలి. నేను ఫ్రీ స్పిరిట్..నా వల్ల కాదు అని తేల్చేసాడు తేజ. ఒకవేళ స్టార్స్‌తో సినిమా చెయ్యాలంటే తనకు ఒక మాసివ్ హిట్ రావాలి అని తేజ అభిప్రాయం. రజినికాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచన్, మహేష్ బాబు వంటి వారైతే తనకు ఓకే అంటున్నాడు తేజ.

Tags:    
Advertisement

Similar News