దాసరి మాదిరిగానే మన్మోహన్‌కు కంగారు!

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా బొగ్గు స్కాంలో తన పాత్ర ఉందని నిందితుడిగా ఇరికించినందుకు తీవ్ర వేదనకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసును త్వరగా విచారించి ముగింపు చెప్పాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ సుప్రీంకోర్టుకు విన్నవించడం చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా ఇదే మాదిరి విన్నపాన్ని చేశారు. తనకు పాత్ర లేని కుంభకోణంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారంటూ […]

Advertisement
Update:2015-10-08 11:46 IST

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా బొగ్గు స్కాంలో తన పాత్ర ఉందని నిందితుడిగా ఇరికించినందుకు తీవ్ర వేదనకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసును త్వరగా విచారించి ముగింపు చెప్పాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ సుప్రీంకోర్టుకు విన్నవించడం చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా ఇదే మాదిరి విన్నపాన్ని చేశారు. తనకు పాత్ర లేని కుంభకోణంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారంటూ పోయినసారి సీబీఐని కలిసినప్పుడు ఆక్రోశం వెళ్ళగక్కారు. అక్కడితో ఆగకుండా దీనికి బాధ్యుడైన నాటి ప్రధానిని వదిలి తనను వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌పైనే ఆరోపణలు గుప్పించారు. మొత్తం మీద తమ మీద పడ్డ మరకలను చెరిపేసుకునేందుకు ఎవరికి వారు హడావుడి పడుతున్నట్టు కనపిస్తోంది. గతంలో మన్మోహన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే ఇపుడున్న కేసుల ప్రకారం ఆయన అప్పీలుపై విచారణ 2018లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మన్మోహన్‌ పిటిషన్‌ను త్వరగా విచారించాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ గురువారం మరో పిటిషన్‌ దాఖలు చేయడం బట్టి చూస్తే కేసు నుంచి బయటపడడానికి తహతహపడుతున్నట్టు అర్దం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News